యాంత్రీకరణతో అధిక దిగుబడులు
పర్లాకిమిడి: వ్యవసాయంలో టెక్నాలజీని వినియోగించుకుంటూ యంత్రాలతో సాగు చేయడం వల్ల అధిక దిగుబడులు సాధించవచ్చని మోహనా ఎమ్మెల్యే దాశరథి గొమాంగో అన్నారు. ప్రాంతీయ స్థాయి వ్యవసాయ పనిముట్ల మేళాను బుధవారం ఆయన ప్రారంభించారు. ఒడిశా అగ్రికల్చర్ టెక్నాలజీ విశ్వవిద్యాలయం (ఓ.యు.ఏ.టి.) విశ్రాంత డీన్ డాక్టర్ సంగ్రాం కేసరి స్వయిని, సబ్ కలెక్టర్ అనుప్ పండా, రాయగడ జిల్లా ముఖ్య వ్యవసాయాధికారి సంతోష్ మిశ్రా, ఒడిశా మిల్లెట్ మేన్ (కొరాపుట్) తపస్ చంద్ర రాయ్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా స్వయిని మాట్లాడుతూ ఒడిశా ఓ.యు.ఏ.టి., ఇక్రిసాట్ ఆధ్వర్యంలో రాగుల పంటలో విత్తనాలు వెదజల్లడం, క్రిమిసంహరిక మందుల పిచికారీ, కోతకోసి, ఎగురపోత చేసే కొత్త పనిముట్లు, యంత్రాలను ముందుకు తెస్తున్నామని చెప్పారు. మేళాలో రైతులకు 50 శాతం సబ్సిడీతో ట్రాక్టర్లు, ట్రసర్ మిషన్లు అందజేస్తున్నుట్ల సబ్ కలెక్టర్ అనుప్ పండా తెలిపారు. గత ఏడాది ఇదే మేళాలో వ్యవసాయ యంత్రాలు అమ్మకాలు రూ.3 కోట్ల వ్యాపారం జరిగిందని, ఈసారి రూ.5కోట్ల వ్యాపారం జరుగుతుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. మోహనా బ్లాక్‌లో మొక్కజొన్న ప్రాసెసింగ్ యూనిట్ నెలకొల్పితే ప్రభుత్వం సబ్సిడీ ఇచ్చి ప్రోత్సహిస్తుందన్నారు. ముఖ్యమంత్రి కృషి ఉద్యోగి యోజనను రైతులు, నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలనిన్నారు. కార్యక్రమంలో జిల్లా ముఖ్యవ్యవసాయాధికారి ఎం.ప్రకాశ్‌రావు, వ్యవసాయాధికారి సూరజ్ ఉప్పలాడ తదితరులు సహకరించారు.
టెక్నాలజీ వినియోగంతో రైతులకు మేలు
వ్యవసాయ పనిముట్ల మేళా
ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే గొమాంగో
యాంత్రీకరణతో అధిక దిగుబడులు
యాంత్రీకరణతో అధిక దిగుబడులు


