ప్రెస్‌క్లబ్ నూతన కార్యవర్గం ఎన్నిక
రాయగడ: ప్రెస్‌క్లబ్ నూతన కార్యవర్గ ఎన్నిక స్థానిక రాణిగుడ ఫారంలోని క్లబ్ కార్యాలయంలో బుధవారం నిర్వహించారు. అధ్యక్షుడిగా సంగ్రామ్ కేసరి పట్నాయక్, ఉపాధ్యక్షునిగా శివసాయి బక్షీ పాత్రో, సాధారణ కార్యదర్శిగా వై.దామోదర్‌రావు, సహ కార్యదర్శిగా సుశాంత్ దాస్, ఆర్గనైజింగ్ సెక్రటరీగా సుశాంత్ ప్రధాన్, కోశాధికారిగా సింహాచల్ పండాచ ఎగ్జిక్యూటివ్ సభ్యులుగా భళ్లమూడి నాగరాజు, శుభ్రత్ చౌదరి నియమితులయ్యారు. క్లబ్ న్యాయ సలహాదారులుగా సీనియర్ న్యాయవాది మదన్ మోహన్ పాడి, న్యాయవాది రితేష్ సబత్‌లు కొనసాగుతారు. కొత్తగా ఏర్పడిన ఈ కార్యవర్గం రెండేళ్ల పాటు కొనసాగుతుంది.
లింగరాజ్ ఆలయంలోకి విదేశీయుడు
భువనేశ్వర్: స్థానిక లింగరాజ్ ఆలయంలోకి హిందూయేతర వ్యక్తి ప్రవేశించాడు. అతడ్ని ఆలయ సేవకుడు సందేహంతో అదుపులోకి తీసుకుని అధికార వర్గాలకు అప్పగించాడు. ప్రాథమిక విచారణలో అతడు జపాన్ నుంచి వచ్చిన పర్యాటకుడిగా గుర్తించారు.
కూలిన ఆస్పత్రి పైకప్పు
భువనేశ్వర్: కటక్ నగరంలో ఎస్సీబీ మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో పైకప్పు కూలింది. ఈ ఘటనలో ఓ రోగి గాయపడ్డాడు. పాత వైద్య విభాగం వార్డులో బుధవారం ఈ ఘటన సంభవించింది. రోగి మంచంపై ఉన్నప్పుడు పైకప్పు తలపై పడటంతో గాయపడ్డాడు. వెంటనే రోగిని వేరొక మంచానికి తరలించి చికిత్స అందించారు.
వాకర్స్ క్లబ్ అధ్యక్షుడిగా
బ్రజసుందర్ నాయక్
రాయగడ: స్థానిక వాకర్స్ క్లబ్ అధ్యక్షుడిగా న్యాయవాది బ్రజసుందర్ నాయక్ నియమితులయ్యారు. 2026–27 సంవత్సరానికి సంబంధించి కొత్త కార్యవర్గం ఎన్నిక సదరు సమితి పితామహాల్‌లో బుధవారం జరిగింది.క్లబ్ ఉపాధ్యక్షులుగా ప్రభాకర్ దొర, జలంధర్ పుసిక, మన్మత తులొ, కార్యదర్శిగా బిశ్వనాథ్ సాహు, కోశాధికారిగా గోపాల్ జైన్ నియమితులయ్యారు. కొత్త కార్యవర్గానికి సభ్యులు అభినందించారు.
ఇసుక రీచ్‌పై దాడులు
రాయగడ: జిల్లాలోని గుణుపూర్ వంశధార ఇసుక రీచ్‌లో గుణుపూర్ ఆదర్శ పోలీసులు, ఓఎంసీ అధికారులు మంగళవారం రాత్రి ఆకస్మిక దాడులు నిర్వహించారు. నిబంధనలు ఉల్లంఘిస్తూ, అనుమతులు లేని జేసీబీ వినియోగించి నదీ గర్భం నుంచి తీస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఇసుక లోడుతో ఉన్న ట్రాక్టర్‌ను సీజ్ చేశారు. జేసీబీ, ట్రాక్టర్‌ను పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అనంతరం కేసు నమోదు చేశారు. కొద్ది రోజుల క్రితం వంశధార నది ఇసుక రీచ్–1లో ఇదే తరహా అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించి లక్ష రూపాయల జరిమానా విధించారు.
ప్రెస్‌క్లబ్ నూతన కార్యవర్గం ఎన్నిక
ప్రెస్‌క్లబ్ నూతన కార్యవర్గం ఎన్నిక
ప్రెస్‌క్లబ్ నూతన కార్యవర్గం ఎన్నిక
ప్రెస్‌క్లబ్ నూతన కార్యవర్గం ఎన్నిక


