ఆధునిక పద్ధతులతో అధిక దిగుబడులు
● రాయగడ ఎమ్మెల్యే అప్పలస్వామి కడ్రక
● ప్రారంభమైన జిల్లాస్థాయి కృషి మేళా
రాయగడ: వ్యవసాయంలో ఆధునిక పద్ధతులు అవలంభిస్తే అధిక దిగుబడులను సాధించవచ్చని రాయగడ ఎమ్మెల్యే అప్పలస్వామి కడ్రక అన్నారు. స్థానిక గోవింద చంద్రదేవ్ ఉన్నత పాఠశాల మైదానంలో జిల్లాస్థాయి కృషి మేళా మంగళవారం ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ.. రైతులు సేంద్రియ వ్యవసాయానికి అధిక ప్రాధాన్యమివ్వాలని సూచించారు. దీనివల్ల భూమి సారవంతం కోల్పోకుండా ఉంటుందన్నారు. అధిక రసాయనాలు వినియోగిస్తే దిగుబడులు తగ్గిపోవడంతో పాటు భూసారం తగ్గిపోయే ప్రమాదముందని హెచ్చరించారు. అధికారుల సూచనలు, సలహాల మేరకు రైతులు వ్యవసాయం చేయాలని సూచించారు.
మెలకువలు పాటించాలి
గుణుపూర్ ఎమ్మెల్యే సత్యజీత్ గొమాంగో మాట్లాడుతూ రైతులు వ్యవసాయంలో మెలకువలు పాటించాలని సూచించారు. మెలకువలు పాటించకపోవడం వలన నష్టాలబారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం రైతులను ఆదుకునేందుకు ముందుకు రావాలని కోరారు. జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఎస్‌కే ఎహేసాన్ మాట్లాడుతూ కృషి మేళ ఈనెల 10వ తేదీ వరకు కొనసాగుతుందన్నారు. రైతులకు వ్యవసాయ రంగంలో అవగాహన కల్పించడంతో పాటు వ్యవసాయ పరికరాల వినియోగం అదేవిధంగా ప్రభుత్వం రైతులకు అందిస్తున్న పథకాల గురించి వివరించడమే ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. కార్యక్రమంలో సమితి అధ్యక్షురాలు టున్ని హుయిక, జిల్లా పరిషత్ సభ్యులు సంధ్యా పులక, బరాటం వరప్రసాదరావు, పద్మావతి మండంగి తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఆధునిక పరిజ్ఞానంతో వ్యవసాయం చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్న కొంతమంది రైతులను సన్మానించారు.
యంత్రాలతో తక్కువ ఖర్చుతో లాభాలు
పర్లాకిమిడి: వ్యవసాయంలో యంత్రాల వినియోగం వలన తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు పొందవచ్చని జిల్లా పరిషత్ అధ్యక్షుడు గవర తిరుపతిరావు అన్నారు. స్థానిక గజపతి స్టేడియంలో ప్రాంతీయ స్థాయి కృషి యంత్రాలు, పనిముట్ల మేళాను ఎమ్మెల్యే రూపేష్ పాణిగ్రాహితో కలిసి మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రూపేష్ మాట్లాడుతూ.. రైతులు ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీలను వినియోగించుకొని కావాల్సిన యంత్రాలు కొనుగోలు చేయాలని సూచించారు. జిల్లా ముఖ్య వ్యవసాయ అధికారి ఎం.ప్రకాష్‌రావు లబ్ధిదారులు, రైతులకు సబ్సిడీ పథకాలు, ఇన్సూరెన్సులు అందజేశారు. కార్యక్రమంలో కలెక్టర్ మునీంద్ర హానగ, రాయగడ వ్యవసాయ అధికారి సంతోష్ మిశ్రా, గుసాని సమితి చైర్మన్ వీర్రాజు, కాశీనగర్ సమితి చైర్మన్ బల్ల శాయమ్మ తదితరులు పాల్గొన్నారు.
ఆధునిక పద్ధతులతో అధిక దిగుబడులు
ఆధునిక పద్ధతులతో అధిక దిగుబడులు
ఆధునిక పద్ధతులతో అధిక దిగుబడులు
ఆధునిక పద్ధతులతో అధిక దిగుబడులు
ఆధునిక పద్ధతులతో అధిక దిగుబడులు


