ముగిసిన గిరిజనోత్సవం
కొరాపుట్ జిల్లా కేంద్రంలోని పాత పోలీసు గ్రౌండ్స్‌లో నిర్వహిస్తున్న పుష్ పుని గిరిజన సాంస్కృతిక ఉత్సవాలు మంగళవారంతో ముగిశాయి. ఈ సందర్భంగా మాజీ మంత్రి రమేష్ చంద్ర మజ్జి మాట్లాడుతూ.. కొరాపుట్ జిల్లా సంస్కృతిలో పుష్ పుని పండగకు ప్రత్యేక స్థానం ఉందన్నారు. అవిభక్త కొరాపుట్ జిల్లాలోని గిరిజనులు ఈ పండగని ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారన్నారు. ఈ కళని రక్షించడానికి స్వాతంత్య్ర పోరాట కుటుంబానికి చెందిన మున్నా త్రిపాఠి తీవ్రంగా కృషి చేస్తున్నారని కొనియాడారు. అంతకుముందు రమేష్ మజ్జి జ్యోతిని వెలిగించి ఉత్సవాలు ప్రారంభించారు. అనంతరం కళాకారులు, మేధావులు, సంఘ సేవకులకు అభినందన ధ్రువపత్రాలు అందజేశారు. కార్యక్రమంలో మాజీ ఎంపీ భగవాన్ మజ్జి, జెడ్పీ మాజీ ప్రెసిడెంట్ మంజులా మజ్జి, పి.ప్రకాష్, నర్సింగ త్రిపాఠి, కౌసల్య ప్రధాని తదితరులు పాల్గొన్నారు.
– కొరాపుట్
ముగిసిన గిరిజనోత్సవం
ముగిసిన గిరిజనోత్సవం
ముగిసిన గిరిజనోత్సవం
ముగిసిన గిరిజనోత్సవం


