అక్రమంగా తరలిస్తున్న మద్యం స్వాధీనం
రాయగడ: రాయగడ మీదుగా గజపతి జిల్లాకు అక్రమంగా బొలేరోలో తరలిస్తున్న విదేశీ మద్యాన్ని రామనగుడ పోలీసులు పట్టుకున్నారు. అందుకు సంబంధించి ఇద్దరిని అరెస్టు చేశారు. అరైస్టెనవారిలో బీహార్‌కు చెందిన అనూజ్ కుమార్ యాదవ్, జిల్లాలోని చందిలి పోలీస్‌స్టేషన్ పరిధి దేవదొల గ్రామానికి చెందిన గణేష్ హిమిరికలు ఉన్నట్లు గుర్తించారు. నిందితులను అరెస్టు చేసి కోర్టుకు తరలించడంతో పాటు, బొలేరో వాహనాన్ని సీజ్ చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. స్వాధీనం చేసుకున్న 386 లీటర్ల విదేశీ మద్యం బాటిళ్ల విలువ సుమారు రూ.7 లక్షలు ఉంటుందని అంచనా.
అక్రమంగా తరలిస్తున్న మద్యం స్వాధీనం


