భాగస్వాములు కావాలి
న్యూస్‌రీల్
మంగళవారం శ్రీ 6 శ్రీ జనవరి శ్రీ 2026
సమాజ సేవలో..
జయపురం: సమాజ సేవలో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలని విక్రమదేవ్ విశ్వవిద్యాలయ బీఈడీ విభాగ చీఫ్ డాక్టర్ మనోరంజన్ ప్రధాన్ అన్నారు. జయపురానికి చెందిన స్వచ్ఛంద సంస్థ సోషియల్ ఎడ్యుకేషనల్ ఎన్విరోన్‌మెంటల్ వెల్ఫేర్ అసోసియేషన్ (సీవా) 29వ వార్షికోత్సవాన్ని ఆదివారం సాయంత్రం స్థానిక జయపురం సిటీ ఉన్నత పాఠశాలలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ.. నేడు చిరు ధాన్యమైన చోళ్లు (మిలెట్స్ రాగి) సమాజానికి ఎంత ఉపయోగకరంగా ఉంటున్నాయో అంతగా సీవా సేవలు సమాజానికి ఉపకరిస్తున్నాయన్నారు. సీవా సంస్థ చేస్తున్న సేవా కార్యక్రమాలను ప్రశావిస్తూ అందుకు కృషి చేస్తున్న సభ్యులను అభినందించారు. మొక్కలు నాటే కార్యక్రమాన్ని మరింత విస్తృత పరచాలని సూచించారు. గౌరవ అతిథిగా పాల్గొన్న ఒడిశా రాష్ట్ర సాయుధ పోలీసు బెటాలియన్ అధికారి రాజేష్ సాహు మాట్లాడుతూ.. దేశ భద్రత దళాల్లో చేసేందుకు కొరాపుట్ యూవత ముందుకు రావాలని.. అటువంటి వారికి తాము శిక్షణ ఇస్తామని పిలుపు నిచ్చారు. కార్యక్రమంలో జయపురం తెలుగు సాంస్కృతిక సమితి అధ్యక్షులు బిరేష్ పట్నాయిక్, సీవా అధ్యక్షులు సుధాకర పట్నాయక్, కార్యదర్శి సౌమ్యరంజన్ దొలాయ్, కోశాధికారి రంజిత్ నాయక్, సహాయ కార్యదర్శి గోపాల కుమార్ సాహు, ఉపాధ్యక్షులు బిశ్వజిత్ మిశ్ర, సీవా వ్యవస్థాపక సభ్యులు సీహెచ్ శ్రీనివాస్, కె.ఉమామహేశ్వరరావు, ప్రతాప్ కుమార్ పట్నాయక్, రమేష్ కుమార్ సాహు పాల్గొన్నారు. లోరి లోపముద్ర జెన, భవానీపట్నాయక్ లు తమ మృదు మధుర స్వరాలతో పాటలు పాడి శ్రోతలను అలరించారు. ఈ సందర్భంగా సీవాలో చేరిన కొత్త సభ్యులు ఎస్.రాజశేఖర్, డి.బాలలను ప్రతాప్ పట్నాయక్ సభకు పరిచయం చేశారు.
భాగస్వాములు కావాలి
భాగస్వాములు కావాలి
భాగస్వాములు కావాలి


