కాంగ్రెస్‌ గూటికి మాజీ ఎమ్మెల్యే కృష్ణ సగారియా | - | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌ గూటికి మాజీ ఎమ్మెల్యే కృష్ణ సగారియా

Aug 15 2023 2:06 AM | Updated on Aug 15 2023 11:42 AM

కొరాపుట్‌: మాజీ ఎమ్మెల్యే కృష్ణ సగారియా తిరిగి కాంగ్రెస్‌ పార్టీలో చేరనున్నట్లు సోమవారం ఒక ప్రకటనలో తెలియజేశారు. సగారియా కొరాపుట్‌ రిజర్వ్‌డ్‌ స్థానం నుంచి కాంగ్రెస్‌ తరుపున 2009–14 మధ్య ఎమ్మెల్యేగా పనిచేశారు. అనంతర పార్టీకి రాజీనామా చేసి బీఎస్పీలో చేరారు. 2014లో ఆ పార్టీ తరుఫున కొరాపుట్‌, జయపురం స్థానాల్లో పోటీచేసి ఓటమి పాలయ్యారు. ప్రస్తుతం కొరాపుట్‌ పార్లమెంటరీ పరిధిలో మాజీ ముఖ్యమంత్రి గిరిధర్‌ గొమాంగో, మాజీ ఎంపీలు హేమావతి గొమాంగ్‌, జయరాం పంగిలు తిరిగి కాంగ్రెస్‌ గూటికి చేరుతున్నారు. ఈ నేపథ్యంలో సగారియా సైతం ఈనెల 21న చేరుతున్నట్లు ప్రకటించారు. రాష్ట్రంలో ఎక్కడా లేనివిధంగా కేవలం కొరాపుట్‌ పార్లమెంటరీ స్థానంలో మాత్రమే కాంగ్రెస్‌ పార్టీలోకి భారీగా వలసలు పెరుగుతుండడంతో ఆసక్తికరంగా మారింది.

Advertisement
 
Advertisement
Advertisement