కొట్‌పాడ్ ఎమ్మెల్యే రూపుభొత్ర
జయపురం:
రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కొట్‌పాడ్ ఎమ్మెల్యే రూపు భొత్ర అన్నారు. జయపురం సబ్‌డివిజన్ కొట్‌పాడ్ కమ్యూనిటీ ఆస్పత్రిలో రోగి కల్యాణ సమితి సమావేశాన్ని బుధవారం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఆస్పత్రికి వచ్చే రోగులకు మౌలిక సౌకర్యాలతో పాటు మెరుగైన వైద్యం అందించేందుకు తగు చర్యలు తీసుకోవాలని వైద్యాధికారులకు సూచించారు. రోగులకు ఉచితంగా మందులు అందజేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా రోగి కల్యాణ సమితి సభ్యులు ఆస్పత్రిలో నెలకున్న సమస్యలను వివరించారు. ముఖ్యంగా వైద్య నిపులను నియమించాలని, రోగులకు రక్షిత తాగునీటి వనరులు కల్పించాలని, వైద్య పరీక్షల కోసం ఆల్ట్రాసౌండ్ సిస్టం సౌకర్యాలను కల్పించాలని విజ్ఞప్తి చేశారు. సమావేశంలో కొట్‌పాడ్ నోటిఫైడ్ ఏరియా కౌన్సిల్ (ఎన్ఏసీ) చైర్మన్ ఎం.శంకరరావు, సమితి సభ్యులు పాల్గొన్నారు.


