న్యూస్‌రీల్
గురువారం శ్రీ 12 శ్రీ నవంబర్ శ్రీ 2026
స్వచ్ఛ సర్వేక్షణ్‌లో..
● భువనేశ్వర్‌కు తొలి రాష్ట్ర స్వచ్ఛ నగరంగా గుర్తింపు
భువనేశ్వర్:
పట్టణ పరిశుభ్రత, పారిశుధ్యం, సుస్థిర వ్యర్థాల నిర్వహణలో ఒడిశా మరోసారి జాతీయ స్థాయిలో సత్తా చాటింది. స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్‌ుడ్స 2025–26లో ‘స్వచ్ఛ కోస్టల్ టౌన్’ విభాగంలో పూరీ అగ్రస్థానాన్ని దక్కించుకుంది. భువనేశ్వర్‌కు ఒడిశాలో తొలి రాష్ట్ర స్వచ్ఛ నగరంగా గుర్తింపు లభించగా, 20 వేల నుంచి 50 వేల జనాభా విభాగంలో అస్కా మున్సిపాలిటీ రెండో ర్యాంకు సాధించింది. బుధవారం న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో జరిగిన అవార్డుల ప్రదానోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా గృహ, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కృష్ణచంద్ర మహాపాత్రో, ఆ శాఖ అదనపు ప్రధాన కార్యదర్శి ఉషా పాఢి అవార్డులు అందుకున్నారు.
పౌరుల భాగస్వామ్యానికి గుర్తింపు..
పట్టణ పారిశుధ్య ప్రమాణాల మెరుగుదల, వ్యర్థాల నిర్వహణ వ్యవస్థల బలోపేతం, పరిశుభ్రత కార్యక్రమాల్లో ప్రజల భాగస్వామ్యాన్ని పెంచేందుకు ఒడిశా ప్రభుత్వం, పట్టణ స్థానిక సంస్థలు చేపట్టిన చర్యలకు ఈ జాతీయ గుర్తింపు లభించింది. పారిశుధ్య కార్మికులు, స్థానిక సంస్థలు, ప్రజల సమష్టి కృషిని కూడా అవార్డులు ప్రతిబింబిస్తున్నాయి. స్వచ్ఛ భారత్ మిషన్ – అర్బన్ కింద దేశ వ్యాప్తంగా చేపట్టిన పట్టణ పరిశుభ్రత, పారిశుధ్య మదింపులో భాగంగా స్వచ్ఛ సర్వేక్షణ్ పదో విడత అవార్‌ుడ్స 2025–26 నిర్వహించారు. ఈ ఏడాది ‘స్వచ్ఛతా కీ నయీ పెహెల్ – బఢాయే హాత్, కరే సఫాయి సాథ్’ అనే నినాదంతో నిర్వహించిన సర్వేక్షణ్‌లో పౌరుల భాగస్వామ్యం, సంస్థాగత జవాబుదారీతనం, నగరాల మధ్య ఆరోగ్యకరమైన పోటీకి ప్రాధాన్యం ఇచ్చారు. అవార్డుల కార్యక్రమంలో స్వచ్ఛ భారత్ మిషన్ – అర్బన్ ప్రత్యేక కార్యదర్శి, మిషన్ డైరెక్టర్ బినయ్ కుమార్ దాస్, భువనేశ్వర్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ సులోచన దాస్, కమిషనర్‌తో పాటు పూరీ, అస్కా మున్సిపల్ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. పూరీ అగ్రస్థానం, భువనేశ్వర్‌కు రాష్ట్ర స్వచ్ఛ నగర గుర్తింపు, అస్కాకు జాతీయ ర్యాంకు.. పట్టణ పరిశుభ్రత, సుస్థిర వ్యర్థాల నిర్వహణలో ఒడిశా సాధిస్తున్న పురోగతికి నిదర్శనంగా నిలిచాయి.


