ఉత్సాహంగా వాలీబాల్‌ పోటీలు | - | Sakshi
Sakshi News home page

ఉత్సాహంగా వాలీబాల్‌ పోటీలు

Nov 12 2026 1:25 AM | Updated on Nov 12 2026 1:25 AM

పర్లాకిమిడి: జిల్లాలో రాయఘడ బ్లాక్‌ పీఎంశ్రీ ప్రభుత్వ ఎస్‌ఎస్‌డీ ఉన్నత మాధ్యమిక పాఠశాలలో 70వ రాష్ట్ర వాలీబాల్‌ చాంపియన్‌ షిప్‌ అండర్‌ –14, అండర్‌– 17 విభాగాల్లో పోటీులు రెండురోజులుగా కొనసాగుతున్నాయి. బుధవారం ఏడీఎం ఫల్గునీ మఝి ముఖ్యఅతిథిగా విచ్చేసి వాలీబాల్‌ జెర్సీని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో డీఈవో మయాధర్‌ సాహు, రాయఘడ బ్లాక్‌ క్రీడాధికారి సంతోష్‌ పండా, ఆదనపు డీఈవో ఎస్‌.గిరిధర్‌, కొంధమాల్‌ శిక్షాధికారి సంజయ్‌కుమార్‌పాత్రో, జిల్లా శారీరక విద్యాలయాల క్రీడాధికారి సురేంద్ర పాత్రో పాల్గొన్నారు. రెండవరోజు కంధమాల్‌, గజపతి, రాయగడ జిల్లాల క్రీడాకారులు మ్యాచ్‌లు ఆడారు. రోజూ 12 నుంచి 15 మ్యాచ్‌లు జరుగుతున్నాయి. ఈనెల 13న ఫైనల్స్‌ మ్యాచ్‌లు జరుగుతాయని నిర్వాహకులు వెల్లడించారు.

ఫోటోనం.85– వాలీబాల్‌ చాపియన్‌ షిప్‌ జెర్సీని ఆవిష్కరిస్తున్న ఏడీఎం ఫల్గునీ మఝి

బోనుకు చిక్కిన ఎలుగులు

జయపురం : జయపురం సబ్‌ డివిజన్‌ బొరిగుమ్మ సమితి బొడిగాం గ్రామం వద్ద తల్లి ఎలుగుబంటి, రెండు పిల్ల ఎలుగులు మంగళవారం సాయంత్రం బోనులో పడ్డాయి. మూడు నెలలుగా ఈ ప్రాంతంలో వన్యప్రాణులు సంచరిస్తుండటంతో ప్రజలకు రక్షణ కల్పించేందుకు వీలుగా అటవీ అధికారులు బోన్లు ఏర్పాటు చేశారు. అందులో ఎలుగులు చిక్కుకున్నాయి. వెంటనే గ్రామస్తులు స్పందించి అటవీ అధికారులకు సమాచారం అందించారు. అనంతరం అక్కడి నుంచి తరలించి సురక్షిత ప్రాంతంలో విడిచిపెట్టారు.

ప్లాస్టిక్‌ విక్రయాలపై ఉక్కుపాదం

జయపురం: పర్యావరణ కాలుష్యానికి, ప్రజల ఆనారోగ్యానికి కారమౌతున్న సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ వస్తువుల వినియోగంపై జయపురం మున్సిపల్‌ అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ వస్తువులు విక్రయించే దుకాణాలు, గిడ్డంగులపై అధికారులు, సిబ్బంది సంయుక్తంగా బుధవారం దాడులు నిర్వహించి పలువురిపై కేసులు పెట్టి జరిమానాలు వసూలు చేశారు. దాడుల్లో 92 కిలోల సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ వస్తువులు సీజ్‌ చేసినట్లు మున్సిపల్‌ అధికారులు వెల్లడించారు. చట్ట వ్యతిరేకంగా సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ సామాన్లు విక్రయించే వ్యాపారుల నుంచి జరిమానాగా రూ.17,500 వసూలు చేశామన్నారు. పట్టణంలో పర్యావరణం పరిరక్షించేందుకు కృషి చేస్తున్నామన్నారు. దాడుల్లో మున్సిపల్‌ ఉద్యోగులు భబాణీ హల్వ, కిరణకుమార్‌ మల్లిక్‌, సత్యనారాయణపాత్రో, బి.స్వరోజ్‌ కుమార్‌, దిగ్విజయస్వై పాల్గొన్నారు.

దుప్పట్లు పంపిణీ

పర్లాకిమిడి: గుసాని సమితి కొర్సండ గ్రామంలో పేదలకు దుప్పట్లు పంపిణీ, సామూహిక సీమంతాలను పారిశెల్లి రామరాజు జరిపించారు. పాతపట్నంకు చెందిన రామరాజు చారిటబుల్‌ ట్రస్టు ఆధ్వర్యంలో ప్రతి ఏటా శీతాకాలంలో వయోవృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేస్తున్నారు. గర్భిణులకు సాముహిక శ్రీమంతాలు జరిపించారు. ఈ కార్యక్రమంలో సర్పంచు ప్రతినిధి జి.కృష్ణారావు, సమితి సభ్యులు కె.జయలక్ష్మి, మాజీ సమితి సభ్యులు కామేశ్వర నాయుడు, అంగన్‌వాడీ వర్కర్‌ సుమిత్రాదేవి, బలరాం, మోహన్‌ రావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement