వేర్వేరు ప్రమాదాల్లో నలుగురు దుర్మరణం | - | Sakshi
Sakshi News home page

వేర్వేరు ప్రమాదాల్లో నలుగురు దుర్మరణం

Nov 12 2026 1:25 AM | Updated on Nov 12 2026 1:25 AM

మృతుల్లో దంపతులు, మరో ఇద్దరు

యువకులు

కొరాపుట్‌: జిల్లాలో వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో నలుగురు దుర్మరణం పాలయ్యారు. నందపూర్‌ సమితి కేంద్రం సమీపంలో హెచ్‌పీ పెట్రోల్‌ బంక్‌ సమీపంలో అతివేగంతో వచ్చిన కారు బైక్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో బైక్‌పై ఉన్న కౌలు రైతు దంపతులు పర్షు హంతాల్‌ (21), హేమా పంగి (21)లు అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదానికి కారణమైన కారు ఆపకుండా వెళ్లిపోయింది. నందపూర్‌ పోలీసులు సీసీ కెమెరాలు పరిశీలించి లమ్తాపుట్‌ సమీపంలోని చంగుడి పొడ వద్ద పట్టుకున్నారు. మరోవైపు లక్ష్మీపూర్‌ రైల్వే గేటు వద్ద బైక్‌పై వస్తూ రంజత్‌ ముదలి (18), వివేక్‌ జానీ(18)లు ఆగి ఉన్న లారీ ఢీకొని ఘటనా స్థలంలోనే మృత్యువాతపడ్డారు. వీరిద్దరూ విద్యార్థులే. లక్ష్మీపూర్‌ పోలీసులు కేసు నమెదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement