వికసిత్‌ భారత్‌ దిశగా.. యువత ప్రతిభను చాటాలి | - | Sakshi
Sakshi News home page

వికసిత్‌ భారత్‌ దిశగా.. యువత ప్రతిభను చాటాలి

Nov 12 2026 1:25 AM | Updated on Nov 12 2026 1:25 AM

జిల్లా స్థాయి యువజన ఉత్సవాల్లో జెడ్పీ అధ్యక్షులు తిరుపతిరావు

పర్లాకిమిడి: యువత మత్తు పదార్థాలకు బానిష కాకుండా తమలోని ప్రతిభను ప్రదర్శించి సమాజంలో ఉన్నత స్థానం సంపాదించి వికసిత్‌ భారత్‌, సమృద్ధి ఒడిశా దిశగా ముందుకు పోవాలని జిల్లా పరిషత్‌ అధ్యక్షులు గవర తిరుపతిరావు పిలుపునిచ్చారు. స్థానిక బిజూ కళ్యాణ మండపంలో బుధవారం నిర్వహించిన జిల్లా యూత్‌ ఫెస్టివల్‌ 2026లో ముఖ్యఅతిథిగా మాట్లాడారు. యువజన ఉత్సవాలలో ఏడీఎం (రెవెన్యూ) మునీంద్ర హానంగ, ఏడీఎం ఫల్గునీ మఝి, పురపాలక సంఘం చైర్మన్‌ నిర్మలా శెఠి, డీఈవో మయాధర్‌ సాహు, జాతీయ ఆథెలెట్‌ కిశోర్‌ చంద్ర రథ్‌ తదితరులు పాల్గొన్నారు. తొలిరోజు వివిధ ఉన్నత పాఠశాలలు, కళాశాలల విద్యార్థులకు నిషాముక్త యువశక్తి అంశంపై పెయింటింగ్‌, నక్కడ్‌ నాటకం, పద్యాల పోటీలు నిర్వహించారు. జిల్లా క్రీడాధికారి త్రినాథ కుమార్‌ సాహు ఈవెంట్లకు అధ్యక్షత వహించగా, న్యాయనిర్ణేతులుగా మనోజ్‌ పాఢి, బినోద్‌ చంద్ర జెన్నా, శుభాంశు శేఖర్‌ పట్నాయక్‌ వ్యవహరించారు. జిల్లాలోని కాశీనగర్‌, గుమ్మా, నువాగడ, రామగిరి, కేంద్రీయ విద్యాలయం, సెంచూరియన్‌ పబ్లిక్‌ స్కూల్‌ విద్యార్థులు పోటీలకు హాజరయ్యారు. రెండు రోజుల పాటు యువజన ఉత్సవాలు జరుగుతాయని జిల్లా యంత్రాంగం వెల్లడించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement