MP's of the Joint Koraput Districts Had a Friendly Meeting With the MP's of the Bordering States - Sakshi
Sakshi News home page

సరిహద్దు ఎంపీలతో కొరాపుట్‌ ఎంపీలు భేటీ

Jul 22 2023 12:52 AM | Updated on Jul 22 2023 7:31 PM

- - Sakshi

కొరాపుట్‌: సరిహద్దు రాష్ట్రాల ఎంపీలతో ఉమ్మడి కొరాపుట్‌ జిల్లాల ఎంపీలు శుక్రవారం స్నేహ పూర్వకంగా భేటీ అయ్యారు. కాంగ్రెస్‌ పార్టీకి చెందిన కొరాపుట్‌ ఎంపీ సప్తగిరి ఉల్క ప్రస్తుతం ఛత్తీస్‌గఢ్‌లో ఆ పార్టీ రాష్ట్ర పరిశీలకునిగా ఉన్నారు. కొరాపుట్‌ పార్లమెంటరీ స్థానానికి సరిహద్దుగా ఛత్తీస్‌గఢ్‌ లోని బస్తర్‌ పార్లమెంటరీ నియోజకవర్గం ఉంది. అక్కడ కాంగ్రెస్‌కు చెందిన దీపక్‌ బైజ్‌ ఎంపీ కొనసాగుతున్నారు. దీపక్‌ను ఏఐసీసీ ఆ రాష్ట్ర పీసీసీ నూతన అధ్యక్షుడిగా అధిస్టానం నియమించింది. దీంతో ఢిల్లీలో కొరాపుట్‌ ఎంపీ సప్తగిరి ఉల్క దంపతులను ఆయన నివాసంలో శుక్రవారం కలుసుకొని, కృతజ్ఞతలు తెలిపారు. మరోవైపు నవరంగ్‌పూర్‌ పార్లమెంట్‌ సభ్యుడు బీజేడీకి చెందిన రమేష్‌చంద్ర మాఝి తన పార్లమెంటరీ స్థానికి సరిహద్దులో ఉన్న ఖత్తీస్‌గఢ్‌ లోని మహసముంద్‌ ఎంపీ చునీలాల్‌ సాహు, బస్తర్‌ ఎంపీ దీపక్‌ బైజ్‌ను స్నేహ పూర్వకంగా కలుసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement