దేశంలో గిరిజన ప్రముఖుల వారసత్వం అమోఘం | - | Sakshi
Sakshi News home page

దేశంలో గిరిజన ప్రముఖుల వారసత్వం అమోఘం

Nov 11 2026 3:45 AM | Updated on Nov 11 2026 3:45 AM

దేశంలో గిరిజన ప్రముఖుల వారసత్వం అమోఘం

వన్‌టౌన్‌(విజయవాడపశ్చిమ): దేశంలో గిరిజన ప్రముఖుల వారసత్వం అమోఘమని విజయవాడ డివిజన్‌ అదనపు డివిజనల్‌ రైల్వే మేనేజర్‌ (మౌలిక సదుపాయాలు) పీఈ ఎడ్విన్‌ అన్నారు. విజయవాడ డివిజన్‌ రైల్వేస్‌ ఆధ్వర్యంలో జనజాతీయ గౌరవ దివాస్‌ వేడుకలను రైల్వే ఇన్‌స్టిట్యూట్‌ ఆడిటోరియంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. పీఈ ఎడ్విన్‌ వేడుకలను ప్రారంభించారు. అనంతరం ఎడ్విన్‌ ప్రసంగిస్తూ గిరిజన స్వాతంత్య్ర సమరయోధులు, భగవాన్‌ బిర్సా ముండా సేవలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలన్నారు. విజయవాడ డివిజన్‌ సీనియర్‌ డివిజనల్‌ పర్సనల్‌ ఆఫీసర్‌ ప్రేమ్‌కుమార్‌ లఖావత్‌ ప్రసంగించారు. డివిజన్‌కు చెందిన భారత్‌ స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌ సభ్యులు ప్రదర్శించిన గిరిజన సంప్రదాయ నృత్యాలు ఆకట్టుకున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement