పోలీసుల తీరుపై వంశీ ఆగ్రహం | - | Sakshi
Sakshi News home page

పోలీసుల తీరుపై వంశీ ఆగ్రహం

Nov 13 2026 8:39 AM | Updated on Nov 13 2026 8:39 AM

వైఎస్సార్‌ సీపీ నేతలపై బైండోవర్‌ కేసుల నమోదుపై నిలదీత పోలీసుల పక్షపాత ధోరణి, దూషణలపై మండిపాటు పోలీసుల వేధింపులు, బెదిరింపులపై కార్యకర్తలకు అండ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని హెచ్చరిక

ఫుట్‌పాత్‌పై

కూర్చుని

నిరసన

హనుమాన్‌జంక్షన్‌రూరల్‌: రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్న తరుణంలో పోలీసులు అధికార పక్షానికి కొమ్ముకాస్తూ, ప్రతిపక్ష పార్టీ గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారని గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌ సీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి వల్లభనేని వంశీ ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వంపై ప్రజావ్యతిరేకత అధికమవుతుండటంతో పోలీసు యంత్రాంగాన్ని అడ్డుపెట్టుకుని ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరగకూడదనే కుట్ర సాగుతోందని వంశీ దుయ్యబట్టారు. గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో వైఎస్సార్‌ సీపీ ప్రచార విభాగం రాష్ట్ర కార్యదర్శి నక్కా గాంధీ సహా పలువురి కార్యకర్తలపై హనుమాన్‌జంక్షన్‌ పోలీసులు బైండోవర్‌ కేసులు నమోదు చేసేందుకు యత్నించడం గురువారం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. వైఎస్సార్‌ సీపీ నేతలను పోలీస్‌స్టేషన్‌కు రావాలంటూ కానిస్టేబుళ్లు ఇంటింటికీ వెళ్లి చెప్పటంతో సాయంత్రం హనుమాన్‌జంక్షన్‌ పోలీస్‌స్టేషన్‌కు అధికసంఖ్యలో తరలివచ్చారు. వీరికి మద్దతుగా మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కూడా ఇక్కడకు చేరుకున్నారు.

భయభ్రాంతులకు గురి చేస్తున్నారు

ఇప్పుడు జరగబోయే పంచాయతీ ఎన్నికలకు గ్రామాల్లో వైఎస్సార్‌ సీపీ నేతలను ప్రచారం చేయనివ్వకుండా, ప్రజలు స్వచ్ఛందంగా ఓట్లు వేయకుండా భయభ్రాంతులకు గురిచేసే కుట్ర జరుగుతోదని వల్లభనేని వంశీ ఆరోపించారు. ప్రజాస్వామ్యంలో పోటీ చేసే అన్ని రాజకీయ పార్టీలకు సమాన హక్కులు ఉంటాయని, పోలీసులు, అధికారులు పక్షపాత ధోరణి ప్రదర్శించడం తగదని హితవు పలికారు. వైఎస్సార్‌ సీపీ కార్యకర్తలు, సామాన్యులు.. పోలీసుల వేధింపులకు గురి కాకుండా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. హనుమాన్‌జంక్షన్‌ పోలీసుల వివాదాస్పద తీరు, ఒంటెత్తు పోకడలపై ఎస్పీకి ఫిర్యాదు చేస్తామని చెప్పారు. ఆయనతో పాటు వైఎస్సార్‌ సీపీ ప్రచార విభాగం రాష్ట్ర కార్యదర్శి నక్కా గాంధీ, గన్నవరం జెడ్పీటీసీ సభ్యుడు అనగాని రవి, మాజీ ఎంపీపీ యర్రగొర్ల నగేష్‌, వైఎస్సార్‌ సీపీ మండల అధ్యక్షుడు ఆవిర్నేని శేషగిరిరావు, పార్టీ నాయకులు చిన్నాల సత్యగణేష్‌బాబు, కొమరవల్లి కిరణ్‌మూర్తి, మూల్పూరు ప్రభుకాంత్‌, పండు నాగార్జున, పత్తిపాటి ఏసుపాదం, తోకల నాగరాజు పాల్గొన్నారు.

వంశీ స్టేషన్‌కు వెళ్లేసరికి సీఐ, ఎస్‌ఐలు అక్కడ లేకపోవడంతో రోడ్డు పక్కనే ఫుట్‌పాత్‌పై కూర్చుని నిరసన తెలిపారు. ఆ తర్వాత కొద్దిసేపటికి సీఐ ఎల్‌.రమేష్‌, ఎస్‌ఐ ఎం.శ్రీనివాస్‌ రావడంతో వైఎస్సార్‌ సీపీ నేతలపై బైండోవర్‌ కేసులు నమోదు చేయడంపై మాజీ ఎమ్మెల్యే వంశీ ప్రశ్నించారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్‌ సమయంలోనూ పలువురు వైఎస్సార్‌ సీపీ ఏజెంట్లపై ఎస్‌ఐ ఎం.శ్రీనివాస్‌ తీవ్ర దుర్భాషలాడారని నిల దీశారు. బాపులపాడు మండలంలో దాదాపు 50 మంది వైఎస్సార్‌ సీపీ నేతలకు బైండోవర్‌ కేసుల పేరుతో పోలీసులు బెదిరింపులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement