గ్రంథాలయాల వైపు అడుగులు వేద్దాం | - | Sakshi
Sakshi News home page

గ్రంథాలయాల వైపు అడుగులు వేద్దాం

Nov 13 2026 8:39 AM | Updated on Nov 13 2026 8:39 AM

గ్రంథాలయాల వైపు అడుగులు వేద్దాం

14 నుంచి 20వ తేదీ వరకు గ్రంథాలయ వారోత్సవాలు బ్రోచర్‌ ఆవిష్కరణ

గాంధీనగర్‌(విజయవాడసెంట్రల్‌): గ్రంథాలయాల వైపు అడుగులు వేసే సమయమొచ్చింది. ఈ నెల 14వ తేదీ నుంచి ప్రారంభం కానున్న 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల బ్రోచర్‌ను గురువారం కలెక్టరేట్‌లోని జేసీ చాంబర్‌లో జాయింట్‌ కలెక్టర్‌ ఎస్‌.ఇలక్కియ, గ్రంథాలయాధికారి రమాదేవితో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ ఈనెల 14నుంచి 20వ తేదీ వరకు ఠాగూర్‌ గ్రంథాలయంలో వారోత్సవాలు జరుగుతాయన్నారు. గ్రంథాలయాధికారి రమాదేవి మాట్లాడుతూ 14వ తేదీ విద్యార్థులకు వివిధ రకాల పోటీలు, విచిత్ర వేషధారణ, క్రాఫ్ట్‌ పోటీలు నిర్వహిస్తామన్నారు. 15న పుస్తక ప్రదర్శన, చదరంగం పోటీలు, కవిసమ్మేళనం, 16న విద్యార్థులకు వ్యాసరచన, వక్తృత్వ పోటీలు, రచయితల సంఘం తో మహిళా కవి సమ్మేళనం, 17న గ్రంథాలయ ఉద్యమకారులపై ఉపన్యాసం, నేర్చుకోవడానికి చదవండి–నాయకత్వం వహించడానికి నేర్చు కోండిపై సదస్సు, రస భారతి నిర్వహణలో ప్రత్యేక సాహిత్య కార్యక్రమం, 18న మ్యూజికల్‌ చైర్స్‌, దేశభక్తి గీతాలు పోటీలు, గోల్కొండ మంగతాయారు స్మారక సాహిత్య సేవా సంస్థ ఆధ్వర్యంలో బాల– యువ కవి సమ్మేళనం. జ్ఞాన జ్యోతి పురస్కార కార్యక్రమం, 19న మహిళలకు ప్రత్యేకంగా పోటీలు, 20న వారోత్సవాల ముగింపు జరుగుతుందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement