అనగాని గెలుపు చారిత్రాత్మకం | - | Sakshi
Sakshi News home page

అనగాని గెలుపు చారిత్రాత్మకం

Nov 11 2026 3:45 AM | Updated on Nov 11 2026 3:45 AM

అనగాని గెలుపు చారిత్రాత్మకం డబ్బుల కోసం బ్లేడ్‌తో విద్యార్థికి బెదిరింపులు

వైఎస్సార్‌సీపీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు పేర్ని నాని

చిలకలపూడి(మచిలీపట్నం): వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని)ని గన్నవరం జెడ్పీటీసీ సభ్యుడు అనగాని రవికుమార్‌ మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లాలో గన్నవరం జెడ్పీటీసీగా పోటీ చేసిన రవికుమార్‌ ఓట్ల లెక్కింపులో 63 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. అయితే రీకౌంటింగ్‌ చేపట్టాలని కూటమి నాయకులు చేసిన పన్నాగాలను కూడా ఛేదించుకుని ఆయన విజయం సాధించారు. ఈ నేపథ్యంలో రవికుమార్‌ గెలుపు చారిత్రాత్మకమని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. రవికుమార్‌ వెంట పార్టీ సీనియర్‌ నాయకులు తోట వెంకయ్య, గోపిశెట్టి వీరాస్వామిలు ఉన్నారు. అనంతరం జిల్లా పరిషత్‌ కార్యాలయంలో జెడ్పీ డెప్యూటీ సీఈవో ఆర్‌సీ ఆనంద్‌కుమార్‌ చేతుల మీదుగా జెడ్పీటీసీగా గెలుపొందిన ధ్రువీకరణ పత్రాన్ని అందుకున్నారు.

గన్నవరం: బ్లేడ్‌తో చంపుతానని బెదిరించి విద్యార్థి వద్ద రూ. 200 నగదును బలవంతంగా లాక్కున్న ఇరువురిపై గన్నవరం పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల సమాచారం ప్రకారం.. మండలంలోని కట్టుబడిపాలెం గ్రామానికి చెందిన కూచిపూడి కార్తీక్‌ గొల్లనపల్లి జెడ్పీ హైస్కూల్‌లో 10వ తరగతి చదువుతున్నాడు. ఈ నేపథ్యంలో సోమవారం సాయంత్రం స్నేహితులు శుభోద్‌, సాత్విక్‌తో కలిసి పాఠశాల బయట ఉన్న సోడా బండి వద్దకు వెళ్లారు. అక్కడ గొల్లనపల్లికి చెందిన మహేష్‌తో పాటు మరో వ్యక్తి మద్యం మత్తులో కార్తీక్‌ను డబ్బులు కోసం బెదిరించారు. తన వద్ద డబ్బులు లేవని కార్తీక్‌ చెప్పడంతో అతని మెడపై బ్లేడ్‌తో గాయపరచడంతో పాటు చంపు తామని బెదిరించి జేబులోని రూ. 200ను బలవంతంగా లాక్కున్నారు. దీంతో కార్తీక్‌ గట్టిగా కేకలు వేయడంతో సమీపంలోని వ్యక్తులు రావడంతో ఇరువురు పరారయ్యారు. గాయపడిన కార్తీక్‌ను చికిత్స నిమిత్తం గన్నవరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు సోమవారం ఇరువురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement