కోనేరుసెంటర్(మచిలీపట్నం): కృష్ణా జిల్లాలో జరిగిన జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల సరళిని ఎస్పీ వి.విద్యాసాగర్‌నాయుడు గురువారం స్వయంగా పరిశీలించారు. జిల్లాలోని పోలింగ్ కేంద్రాలను సందర్శించి బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించారు. మచిలీపట్నంతో పాటు పెడన, పామర్రు, గన్నవరం తదితర నియోజకవర్గాల్లో పర్యటించిన ఎస్పీ అక్కడి పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాటుచేసిన బందోబస్తును పరిశీలించి, అధికారులు, సిబ్బందికి పలు ఆదేశాలు జారీ చేశారు. ఓటర్లతో మాట్లాడి అక్కడి ఏర్పాట్లపై ఆరా తీశారు. ఎవరైనా ప్రలోభాలకు గురి చేసేందుకు ఒత్తిడి తెస్తే పోలీసుతో పాటు ఎన్నికల సిబ్బందికి తెలపాలని సూచించారు. గన్నవరంలో ఏలూరు రేంజ్ ఐజీపీ అశోక్‌కుమార్ పోలింగ్ కేంద్రాన్ని సందర్శించగా ఎస్పీ జిల్లాలోని బందో బస్తు ఏర్పాట్లను వివరించారు.
జిల్లా పోలీసులకు అభినందనలు
జిల్లాలో ఎన్నికల విధులు నిర్వహించిన పోలీసు సిబ్బందికి జిల్లా ఎస్పీ విద్యాసాగర్‌నాయుడు అభినందనలు తెలిపారు. మునిసిపల్, పరిషత్ ఎన్నికల నిర్వహణకు సహకరించిన పోలీసు అధికారులు, సిబ్బందికి ప్రత్యేక అభినందనలు చెప్పారు.


