భవన నిర్మాణ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి | - | Sakshi
Sakshi News home page

భవన నిర్మాణ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

Oct 1 2026 9:45 AM | Updated on Oct 1 2026 9:45 AM

పటమట(విజయవాడతూర్పు): భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు కార్మికుల ఉన్నతికోసం ఉండాలని, పథకాల అమలు కోసం కాదని, పాత పద్ధతిలో సంక్షేమ బోర్డును పునఃప్రారంభించాలని ఎన్టీఆర్‌ జిల్లా బిల్డింగ్‌ వర్కర్స్‌ యూనియన్‌ (సీఐటీయూ) పట్టణ కమిటీ ఆధ్వర్యంలో కార్మిక బోర్డు డెప్యూటీ లేబర్‌ కమిషనర్‌ కార్యాలయ ఏఎల్‌వో రాజేష్‌కు బుధవారం వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్‌ జిల్లా బిల్డింగ్‌ వర్కర్స్‌ యూనియన్‌ అధ్యక్షుడు పిల్లి నరసింహారావు మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మికులకు రాష్ట్రంలో తీవ్రమైన అన్యాయం జరుగుతుందన్నారు. కార్మికుల సమస్యలను ఇప్పటి వరకు కార్మిక శాఖమంత్రి పట్టించుకోకపోవటం శోచనీయమని, దీనిపై ప్రభుత్వం స్పందించకపోతే ఉద్యమం చేస్తామని పేర్కొన్నారు. కార్మికుల సంక్షేమం కోసం అక్టోబర్‌ 8న రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో పట్టణ మండల ప్రభుత్వ కార్యాలయాలు వద్ద ధర్నాన్ని నిర్వహిస్తున్నామని ప్రకటించారు. విజయవాడ సెంట్రల్‌ ఈస్ట్‌, మూడు పట్టణ నాయకులు నాగేశ్వరరావు, గురుమూర్తి, వీబీ రాజు, గోవిందు, బాబూరావు, సుబ్బారెడ్డి, రణస్థలం సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement