ఆటోనగర్(విజయవాడతూర్పు): వృద్ధురాలైన తన తల్లి తుది శ్వాస విడవడంతో కూతుళ్లే తల కొరివి పెట్టిన ఘటన పెనమలూరు మండలం కానూరులో బుధవారం జరిగింది. వివరాలు ఇవి.. కానూరు గ్రామానికి చెందిన ముదిగొండ అమ్మ (86) అనారోగ్యంతో మృతి చెందారు. మృతురాలికి కొడుకులు లేరు. నలుగురు కుమార్తెలు. ఒక కుమార్తె గతంలోనే చనిపోయింది. దీంతో తల్లి అంత్యక్రియలను మిగిలిన కుమార్తెల్లో ఇద్దరు కుమార్తెలు భీమవరపు లలితకుమారి, ధర్మవరపు లక్ష్మిరాణి చేతుల మీదుగా జరిగించారు. భీమవరపు లలితకుమారి తల కొరివి పెట్టగా.. మరొక కూతురు ధర్మవరపు లక్ష్మిరాణి పాడె మోశారు.
విమానాశ్రయం(గన్నవరం): కామన్వెల్త్ పవర్ లిఫ్టింగ్ పోటీల్లో రజత పతకం సాధించి స్వదేశానికి తిరిగి వచ్చిన ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ శాఖ కానిస్టేబుల్ సీర చంద్రకళకు బుధవారం గన్నవరం విమానాశ్రయంలో ఘనస్వాగతం లభించింది. కెనడాలోని విన్నిపెగ్‌లో జరిగిన ఈ పోటీల్లో 76 కిలోల మహిళల విభాగంలో చంద్రకళ ద్వితీయ స్థానంలో నిలిచి రజత పతకం అందుకుంది. విమానాశ్రయంలో చంద్రకళకు ఎకై ్సజ్ శాఖ అధికారులు, సిబ్బంది, పవర్ లిఫ్టింగ్ కోచ్‌లు, క్రీడాకారులు, కుటుంబ సభ్యులు పుష్పగుచ్ఛాలు అందజేసి స్వాగతం పలికారు. రాష్ట్ర ఎకై ్సజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ఆమెను దుశ్శాలువాతో సత్కరించి అభినందించారు.
మరో ఇరువురు క్రీడాకారులకు..
కామన్వెల్త్ పవర్ లిఫ్టింగ్ పోటీల్లో 76 కిలోల విభాగంలో బంగారు పతకం గెలుచుకున్న లిఖిత, 47 కేజీల జూనియర్ విభాగంలో రజత పతకం సాధించిన మధిర షానూన్ కూడా విమానాశ్రయానికి చేరుకున్నారు. వీరికి పలువురు క్రీడా సంఘాల ప్రతినిధులు, కుటుంబ సభ్యులు స్వాగతం పలికారు.


