గుర్తు తెలియని మృతదేహాలు లభ్యం | - | Sakshi
Sakshi News home page

గుర్తు తెలియని మృతదేహాలు లభ్యం

Oct 1 2026 9:45 AM | Updated on Oct 1 2026 9:45 AM

కంకిపాడు: గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యమైన సంఘటనపై స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో బుధవారం కేసు నమోదైంది. ఎస్‌ఐ కేవైదాసు తెలిపిన కథనం మేరకు.. మండలంలోని పునాదిపాడు గ్రామ పంచాయతీ పరిధిలోని శరత్‌ చంద్ర ఐఏఎస్‌ అకాడమీ ఎదురుగా ఉన్న గ్యాస్‌ గోదాము సమీపంలోని పంట బోదెలో గుర్తుతెలియని మహిళ మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. ఈ మేరకు వీఆర్‌ఓ అందించిన సమాచారం మేరకు పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతురాలి వయస్సు 45–50ఏళ్ల మధ్య వయస్సు ఉంటుందని నిర్ధారించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతురాలి ఆచూకీ, మృతికి గల కారణాలు నిర్ధారించేందుకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ దాసు తెలిపారు.

చికిత్స పొందుతూ మరొకరు..

మైలవరం: మైలవరం పరిసర ప్రాంతాల్లో సుమారు నెల రోజులుగా సంచరిస్తూ కనిపించిన సుమారు 60 నుంచి 70ఏళ్ల మధ్య వయస్సు గల గుర్తు తెలియని మగ వ్యక్తి మైలవరం ఎల్‌బీఆర్‌సీఈ సమీపంలోని దర్గా వద్ద అనారోగ్యంతో ఉన్నట్లు తెలిసిందని పోలీసులు బుధవారం తెలిపారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఈ వ్యక్తిని ఈ నెల 24న మైలవరం ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స నిమిత్తం చేర్పించగా.. ఈ వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందినట్లు తెలిపారు. మృతుని వద్ద గుర్తించడానికి ఎలాంటి ఆధారాలు లభించలేదని, తెలిసిన వారు 94407 96447కు సమాచారం ఇవ్వాల్సిందిగా ఎస్‌ఐ సుధాకర్‌ కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement