జెడ్పీకి వన్నె తెచ్చిన పాలకవర్గం | - | Sakshi
Sakshi News home page

జెడ్పీకి వన్నె తెచ్చిన పాలకవర్గం

Sep 23 2026 2:06 AM | Updated on Sep 23 2026 2:06 AM

జెడ్పీకి వన్నె తెచ్చిన పాలకవర్గం ● వెనుకడుగు వేయకుండా ప్రజాసమస్యలపై పోరాడింది ● మాజీ మంత్రి పేర్ని నాని

చిలకలపూడి(మచిలీపట్నం): జిల్లా పరిషత్‌కు ప్రస్తుత పాలకవర్గం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి వన్నె తెచ్చారని మాజీ మంత్రి, వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు పేర్ని వెంకట్రామయ్య (నాని) అన్నారు. జిల్లా పరిషత్‌ కన్వెన్షన్‌ హాలులో మంగళవారం జెడ్పీటీసీ, ఎంపీపీలతో ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు. ఐదేళ్లుగా సభ్యులు చేసిన పనులు వారి అనుభవాలు, సలహాలు, సూచనలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో పేర్ని నాని మాట్లాడుతూ జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌గా ఉప్పాల హారిక ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమన్నారు. రెండేళ్లుగా చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తరువాత ఎన్ని అడ్డంకులు సృష్టించినా వెనుకడుగు వేయకుండా ప్రజాసమస్యలు, రైతుల సమస్యలను సమావేశంలో అధికారుల దృష్టికి తీసుకువచ్చి గళం విప్పారన్నారు.

ఏకై క మంత్రికి బాధ్యత లేదు..

ఉమ్మడి కృష్ణాజిల్లాకు ఏకై క మంత్రిగా ఉన్న కొల్లు రవీంద్ర రెండు సంవత్సరాల్లో నిర్వహించిన సర్వసభ్య సమావేశానికి ఒక్కసారి మాత్రమే వచ్చారని, వారు రాకపోతే సమస్యలు ఎలా చెప్పుకుంటామని ఓ సభ్యుడు చెప్పిన మాట వాస్తవమేనని పేర్ని నాని అన్నారు. వైఎస్‌ జగన్‌ అసెంబ్లీకి రారని మాట్లాడే కూటమి నాయకులు జిల్లా పరిషత్‌ సర్వసభ్య సమావేశానికి ఎందుకు హాజరుకావటం లేదని అనటం వాస్తవం అనిపించిందన్నారు. మంత్రిగా సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేకే సమావేశాలకు హాజరుకాలేదని పేర్ని నాని దుయ్యబట్టారు. చైర్‌పర్సన్‌, పాలకవర్గానికి రెండు సంవత్సరాలుగా ఎన్నో అడ్డంకులు సృష్టించారన్నారు.

ఒక్క రూపాయి రాకున్నా..

చంద్రబాబు ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి కూడా నిధులు తీసుకురాకుండా జెడ్పీ నిధులను వారే తెచ్చినట్లుగా అధికారులను బెదిరించి పబ్బం గడుపుకొనే ప్రయత్నం చేశారని పేర్ని అన్నారు. అయినప్పటికీ సభ్యులు భయపడకుండా వారికి కేటాయించిన నిధులను పనులు పూర్తి చేయటం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ మొండితోక అరుణకుమార్‌, పెడన నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ ఉప్పాల రాము, జెడ్పీ వైస్‌ చైర్మన్లు గరికపాటి శ్రీదేవి, గుదిమళ్ల కృష్ణంరాజు పాల్గొన్నారు. అనంతరం జిల్లా పరిషత్‌ పాలకవర్గ సభ్యుల పదవీకాలం గురువారంతో ముగియనుండటంతో చైర్‌ పర్సన్‌ దంపతులతో పాటు జెడ్పీటీసీ, ఎంపీపీలను పేర్ని నాని ఘనంగా సత్కరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement