ఏఎన్‌ఎంలపై పనిభారం తగ్గించాలని ధర్నా | - | Sakshi
Sakshi News home page

ఏఎన్‌ఎంలపై పనిభారం తగ్గించాలని ధర్నా

Sep 23 2026 2:06 AM | Updated on Sep 23 2026 2:06 AM

లబ్బీపేట(విజయవాడతూర్పు): మొబైల్‌ ఓటీపీ సేకరణ విధానం ద్వారా జరిగే అన్ని ఆరోగ్య సర్వేలను తక్షణం రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ ఏపీ ప్రజారోగ్య వైద్య ఉద్యోగుల సంఘం ఆధ్వర్యలో డీఎంహెచ్‌ఓ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. గత నాలుగు రోజులుగా జరుగుతున్న వరుస ఉద్యమాలలో భాగంగా ఈ రోజు మంగళవారం పాత గవర్నమెంట్‌ ఆస్పత్రి ఆవరణలోని డీఎంహెచ్‌ఓ కార్యాలయం వద్ద నిర్వహించిన ధర్నాల్లో పెద్ద సంఖ్యలో ఏఎన్‌ఎంలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏఎన్‌ఎంలపై పని భారాన్ని తగ్గించాలని, ఓటీపీ రహిత సర్వేలను మాత్రమే ప్రభుత్వం తమకు అప్పగించాలని, క్షేత్రస్థాయి సిబ్బందికి ఎఫ్‌ఆర్‌ఎస్‌ హాజరు విధానం నుంచి మినహాయింపును ఇవ్వాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఏపీ ప్రజారోగ్య వైద్య ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జి. ఆస్కారరావు మట్లాడుతూ అధికారులు తక్షణమే స్పందించి లెప్రసీ సర్వేలో పబ్లిక్‌ నుంచి ఇంటింటికీ, మనిషి మనిషికి ఓటీపీ సేకరించి సర్వే పూర్తి చేయాలన్న షరతును ఉపసంహరించాలని ప్రభుత్వా న్ని హెచ్చరించారు. యూనియన్‌ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు టీడీకే సాగర్‌, జిల్లా నాయకులు కొండపల్లి శ్రీనివాసరావు, ఎ. దుర్గాప్రసాద్‌, ఎంవీవీ సత్యనారాయణ తదితరులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement