అర్జీలకు నాణ్యమైన పరిష్కారం చూపాలి | - | Sakshi
Sakshi News home page

అర్జీలకు నాణ్యమైన పరిష్కారం చూపాలి

Aug 18 2026 9:08 AM | Updated on Aug 18 2026 9:08 AM

● ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ లక్ష్మీశ ● పీజీఆర్‌ఎస్‌లో 176 అర్జీల స్వీకరణ

గాంధీనగర్‌(విజయవాడసెంట్రల్‌): ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్‌) ద్వారా ప్రజల నుంచి స్వీకరించే ప్రతి అర్జీకి నాణ్యమైన, సంతృప్తికరమైన పరిష్కారం చూపాలని ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ డాక్డర్‌ జి.లక్ష్మీశ సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రజల సమస్యలను క్షుణ్ణంగా పరిశీలించి, నిబంధనల మేరకు నిర్ణీత గడువులోగా పరిష్కారం చూపాలని పేర్కొన్నారు. ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టరేట్‌ లోని పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో సోమవారం పీజీఆర్‌ఎస్‌ కార్యక్రమం జరిగింది. కలెక్టర్‌ లక్ష్మీశ అధికారులతో కలిసి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. అనంతరం కలెక్టర్‌ మాట్లాడుతూ.. పీజీఆర్‌ఎస్‌ అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి త్వరితగతిన పరిష్కరించేందుకు అధికారులు కృషిచేయా లని ఆదేశించారు. క్షేత్రస్థాయి అధికారులతో సమన్వయం చేసుకొని అర్జీల పరిష్కారానికి సంబం ధించి నాణ్యత, సంతృప్తి స్థాయిలో జిల్లాను ముందు వరుసలో నిలపాలని కోరారు. అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యాన్ని సహించేది లేదని హెచ్చరించారు.

మొత్తం 176 అర్జీలు

జిల్లాస్థాయి పీజీఆర్‌ఎస్‌ కార్యక్రమంలో వివిధ సమస్యల పరిష్కారం కోరుతూ మొత్తం 176 అర్జీలు వచ్చాయని కలెక్టర్‌ లక్ష్మీశ తెలిపారు. వీటిలో రెవెన్యూకు సంబంధించి అత్యధికంగా 52 అర్జీలు ఉన్నాయని వివరించారు. శాఖల వారీగా పురపా లక – పట్టణాభివృద్ధి శాఖకు సంబంధించి 32, పోలీసు శాఖ 24, పంచాయతీ రాజ్‌లో 17 అర్జీలు వచ్చాయి. వైద్య ఆరోగ్యం, స్వర్ణగ్రామం–స్వర్ణ వార్డుకు ఆరు చొప్పున అర్జీలు రాగా విద్యుత్‌, ఉపాధి కల్పన, రిజిస్ట్రేషన్‌ అండ్‌ స్టాంప్స్‌కు నాలుగు చొప్పున అర్జీలు వచ్చాయి. డీఆర్‌డీఏ, ఇంటర్మీడియెట్‌ విద్యకు మూడు చొప్పున, వ్యవసాయం, విభిన్న ప్రతిభావంతుల సంక్షేమం, జాతీయ రహదారుల విభాగాలకు రెండేసి చొప్పున అర్జీలు వచ్చాయి. ఆర్కియాలజీ అండ్‌ మ్యూజి యమ్స్‌, ప్రజా రవాణా, ఎకై ్సజ్‌, అగ్నిమాపక, మత్స్య, ఐసీడీఎస్‌, ఇరిగేషన్‌, కార్మిక, మార్కెటింగ్‌, మైన్స్‌ అండ్‌ జియాలజీ శాఖలకు ఒక్కో అర్జీ వచ్చాయి. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లాస్థాయి అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement