ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మను సినీ నటి శ్రీలీల, బాల నటుడు బుల్లిరాజు(రేవంత్)శనివారం దర్శించుకున్నారు. అమ్మవారి దర్శనానికి విచ్చేసిన వారిరువురికి ఆలయ అధికారులు సాదరంగా స్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపించుకున్న అనంతరం వేద పండితులు ఆశీర్వచనం అందజేయగా, ఆలయ అధికారులు, అర్చకులు అమ్మవారి ప్రసాదాలను అందజేశారు.
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ సన్నిధిలో జరుగుతున్న నిత్యాన్నదానానికి విజయవాడకు చెందిన భక్తులు శనివారం రూ.లక్ష విరాళాన్ని అందజేశారు. కానూరుకు చెందిన బి.శిల్పి, బి.సనీల కుటుంబం అమ్మవారిని దర్శించుకునేందుకు ఇంద్రకీలాద్రికి విచ్చేసింది. ఈ సందర్భంగా వారు ఆలయ అధికారులను కలిసి నిత్యాన్నదానానికి రూ.1,00,116ల విరాళాన్ని అందజేశారు. దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం డీఈవో కిషోర్‌కుమార్ దాతలకు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను అందజేశారు.


