దేశ సేవకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలి | - | Sakshi
Sakshi News home page

దేశ సేవకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలి

Aug 17 2026 7:29 AM | Updated on Aug 17 2026 7:29 AM

దేశ సేవకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలి అకడమిక్‌ ఇన్‌స్ట్రక్టర్‌ పోస్టుల నియామకానికి నోటిఫికేషన్‌ అత్యవసర సేవలూ బహిష్కరిస్తాం : జూడాలు

పంద్రాగస్టు వేడుకల్లో సీపీ రాజశేఖరబాబు

లబ్బీపేట(విజయవాడతూర్పు): స్వాతంత్య్ర సమరయోధులను స్ఫూర్తిగా తీసుకుని దేశ సేవకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని ఎన్టీఆర్‌ జిల్లా పోలీస్‌ కమిషనర్‌ ఎస్‌వీ రాజశేఖరబాబు అన్నారు. సీపీ కార్యాలయంలో శనివారం సీపీ రాజశేఖరబాబు జాతీయ పతాకాన్ని ఎగురవేసి, గౌరవ వందనం స్వీకరించారు. కార్యక్రమంలో డీసీపీలు కృష్ణకాంత్‌ పటేల్‌, కె.తిరుమలేశ్వరరెడ్డి, కేజీవీ సరిత, ఏబీటీఎస్‌ ఉదయరాణి, కె.కృష్ణ ప్రసన్న, బి.లక్ష్మీనారాయణ, జి. రామకృష్ణ, బి.సత్యనారాయణ, ఏడీసీపీలు, ఏసీపీలు, సీఐలు, ఎస్‌ఐలు పాల్గొన్నారు.

వన్‌టౌన్‌(విజయవాడపశ్చిమ): జిల్లాలోని 2026–2027 విద్యా సంవత్సరంలో అకడమిక్‌ ఇన్‌స్ట్రక్టర్‌ పోస్టుల నియామకానికి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు డీఈఓ ఎల్‌.చంద్రకళ తెలిపారు. స్కూల్‌ అసి స్టెంట్‌లకు రూ.12,500, సెకండరీ గ్రేడ్‌ టీచర్లకు రూ.10,000 గౌరవ వేతనంతో ఈ పోస్టులు భర్తీ చేస్తారన్నారు. జిల్లాలోని వివిధ మండ లాల్లో స్కూల్‌ అసిస్టెంట్‌లకు సబ్జెక్ట్‌ల వారీగా 81, సెకండరీ గ్రేడ్‌ టీచర్‌ పోస్టులకు రెండు ఖాళీలు ఉన్నాయని, ఆసక్తి కలిగిన అభ్యర్థులు సంబంధిత ఎంఈఓ కార్యాలయంలో ఈ నెల 21 లోపు దర ఖాస్తులు అందజేయాలని కోరారు.

లబ్బీపేట(విజయవాడతూర్పు): స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని జూనియర్‌ వైద్యులు శనివారం తమ నిరసనను శాంతియుతంగా నిర్వహించారు. తొలుత జీజీహెచ్‌, వైద్య కళాశాలల్లో జరిగిన జెండా వందనం కార్యక్రమంలో జూడాలు పాల్గొన్నారు. అనంతరం రిలే దీక్షా శిబిరానికి చేరుకుని శాంతియుతంగా దీక్షలు చేపట్టారు. ప్రభుత్వం శనివారం సాయంత్రం 5 గంటల లోపు తమ సమస్యలు పరిష్కరించాలని జూడాలు అల్టిమేటం జారీ చేశారు. అయితే ప్రభుత్వం ఇప్పటి వరకూ ఎలాంటి చర్చలకు పిలవలేదు. దీంతో జూడాలు సోమవారం నుంచి అత్యవసర సేవలు సైతం బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement