రైళ్లలో సెల్‌ఫోన్లు చోరీ చేస్తున్న దొంగ అరెస్ట్‌ | - | Sakshi
Sakshi News home page

రైళ్లలో సెల్‌ఫోన్లు చోరీ చేస్తున్న దొంగ అరెస్ట్‌

Aug 11 2026 1:54 AM | Updated on Aug 11 2026 1:54 AM

రైళ్లలో సెల్‌ఫోన్లు చోరీ చేస్తున్న దొంగ అరెస్ట్‌ చికిత్స పొందుతూ వృద్ధుడి మృతి

వన్‌టౌన్‌(విజయవాడపశ్చిమ): రైళ్లలో తిరుగుతూ ప్రయాణికుల దగ్గర సెల్‌ఫోన్లు చోరీ చేసే దొంగను రైల్వే పోలీసులు సోమవారం అరెస్ట్‌ చేశారు. వివరాల్లోకి వెళితే జీఆర్పీ సీఐ రమణ ఆధ్వర్యంలో సాధారణ తనిఖీల్లో భాగంగా సిబ్బంది ఆదివారం రైల్వేస్టేషన్‌ను తనిఖీ చేశారు. ఈ క్రమంలో ప్లాట్‌ ఫాం నంబర్‌ 10, ఉత్తర దిక్కు వైపున ఉన్న ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జి వద్దకు వచ్చేసరికి 45 ఏళ్ల షేక్‌ గౌసే అనే వ్యక్తి తారసపడ్డాడు. అతని నడవడికి అనుమానాస్పదంగా ఉండటంతో పోలీసులు అతని వద్ద ఉన్న బ్యాగ్‌ను పరిశీలించగా అందులో 13 సెల్‌ఫోన్లు ఉన్నట్లు గుర్తించారు. నిందితుడు షేక్‌ గౌసే విజయవాడ కుమ్మరిపాలెం సెంటర్‌లోని మసీదురోడ్డులో నివాసిగా గుర్తించారు. అతడిని అరెస్ట్‌ చేసి సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. మొత్తం సొత్తు విలువ సుమారుగా రెండు లక్షల రూపాయలు ఉంటుందని పోలీసులు పేర్కొన్నారు. నిందితుడిని కోర్టులో హాజరుపరిచారు.

పెనమలూరు: కానూరు 100 అడుగుల రోడ్డులో జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వృద్ధుడు మాదల రామచంద్రరావు(69) సోమవారం మృతి చెందారు. పోరంకి ఎస్‌ఐ ఉషారాణి తెలిపిన వివరాల ప్రకా రం పెదఓగిరాలకు చెందిన రామచంద్రరావు ఈ నెల 7న కానూరు 100 అడు గుల రోడ్డులోని అన్నే కల్యాణ మండపంలో పుస్తక ఆవిష్కరణకు బైక్‌పై బయలుదేరాడు. ఆయన కానూరు న్యూఆటోనగర్‌ నుంచి 100 అడుగుల రోడ్డులోని కల్యాణ మండపం వద్దకు రాగా వెనుక నుంచి వచ్చిన బైక్‌ ఢీ కొట్టింది. ఈ ఘటనలో రామచంద్రరావు తలకు తీవ్ర గాయాల య్యాయి. అతడిని స్థానిక ఆస్పత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడి బంధువు నరేంద్రబాబు ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement