యువత భవితకు ఎందాకై నా.. | - | Sakshi
Sakshi News home page

యువత భవితకు ఎందాకై నా..

Aug 8 2026 1:41 AM | Updated on Aug 8 2026 1:41 AM

● మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్‌ ● రిలే దీక్షలపై దాడికి టీడీపీ నేతల యత్నం ● ఉద్రిక్తంగా బాప్టిస్ట్‌పాలెం ● టీడీపీ అరాచకాలను ప్రజలకు వివరిస్తాం ● మాజీ మేయర్‌ రాయన భాగ్యలక్ష్మి మాట్లాడుతూ డీఎస్సీ అక్రమాల్లో భాగంగా ప్రభుత్వం వారికి అనుకూలమైన జీవోలు విచ్చలవిడిగా ఇచ్చిందని ఆరోపించారు. రాష్ట్రంలో మహిళలపై దాడులు పెరిగాయన్నారు. ఇచ్చిన హామీలను అడిగితే ఉక్రోషంతో ఇష్టమొచ్చినట్లుగా టీడీపీ శ్రేణులు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ● పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆసిఫ్‌ మాట్లాడుతూ అసమర్థ ప్రభుత్వం దాడులకు తెగబడుతోందని ధ్వజమెత్తారు. డీఎస్సీల్లో వేలాది మంది యువత ప్రభుత్వ అక్రమాల కారణంగా అన్యాయానికి గురయ్యారన్నారు. ● పార్టీ అధికార ప్రతినిధి బండి పుణ్యశీల మాట్లాడుతూ కూటమి ప్రభుత్వానికి నూకలు చెల్లాయన్నారు. పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి చాలా స్పష్టంగా డీఎస్సీలో జరిగిన అక్రమాలను వివరించారని గుర్తు చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ రుహుల్లా, మాజీ చైర్మన్‌లు కర్నాటి రాంబాబు, తోలేటి శ్రీకాంత్‌, గౌస్‌మొహిద్దీన్‌, స్థానిక డివిజన్‌ అధ్యక్షుడు స్వామి వివేకానంద, మాజీ కార్పొరేటర్లు యలకల చలపతిరావు, ఇర్ఫాన్‌, చైతన్యరెడ్డి, కోటిరెడ్డి, మండేపూడి చటర్జీ, శిరంశెట్టి పూర్ణ, ఆంజనేయరెడ్డి, సహాయ కార్యదర్శి హయత్‌, రాష్ట్ర నేతలు దాసి జయప్రకాష్‌కెనడి తదితరులు పాల్గొన్నారు.

వన్‌టౌన్‌(విజయవాడపశ్చిమ): యువత భవిత కోసం దేనికై నా సిద్ధమని మాజీ మంత్రి, వైఎస్సార్‌ సీపీ పశ్చిమ నియోజకవర్గ ఇన్‌చార్జి వెలంపల్లి శ్రీనివాసరావు చెప్పారు. డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ చేయాలని, నిరుద్యోగ భృతిని చెల్లించాలని, ఫీజు బకాయిలు విడుదల చేయాలని కోరుతూ వైఎస్సార్‌ సీపీ ఆధ్వర్యంలో స్థానిక బాప్టిస్ట్‌పాలెంలోని ఆ పార్టీ 35వ డివిజన్‌ కార్యాలయం వద్ద శుక్రవారం చేపట్టిన రిలేదీక్షలు ఉద్రిక్తంగా మారాయి.

దాడికి తెగబడిన టీడీపీ శ్రేణులు

శాంతియుతంగా పార్టీ కార్యాలయం ప్రాంగణంలో చేపట్టిన దీక్షలపై టీడీపీ దాడికి తెగబడింది. ఆ పార్టీ పశ్చిమ ఇన్‌చార్జిగా నియమితులైన బుద్ధా వెంకన్నను పోలీసు అధికారులు గృహనిర్బంధం చేయగా దాడి చేయాలని, శిబిరాన్ని తీసివేయాలని పార్టీ శ్రేణులను రెచ్చగొట్టి బాప్టిస్ట్‌పాలెం వద్దకు పంపించారు. దీంతో ఆ పార్టీ నేతలు కొట్టేటి హనుమంతరావు, గుర్రం కొండ, తుపాకుల రమణమ్మ తదితరుల నేతృత్వంలో టీడీపీ శ్రేణులు దీక్షా శిబిరాన్ని ముట్టడించి దాడికి ప్రయత్నించారు. వారిని సమీపంలోనే పోలీసులు అడ్డుకొని నిలువరించారు.

బొండా ఉమా ఎంతగా రౌడీయిజం చేస్తే అంతగా ఉద్యమిస్తాం

శాంతియుతంగా దీక్షలు చేస్తున్న వైఎస్సార్‌ సీపీ నేతలపై టీడీపీ నేతలు బొండా ఉమా, బుద్ధా వెంకన్న తదితరులు ఎంతగా రౌడీయిజం చేస్తే అంతగా ఉద్యమిస్తామని వెలంపల్లి శ్రీనివాసరావు హెచ్చరించారు. బొండా ఉమా అరాచకాలను ప్రజలకు వివరిస్తామన్నారు. డీఎస్సీలో అక్రమాలకు పాల్పడి వందలాది యువకుల జీవితాలతో చెలగాటమాడుతున్న కూటమి ప్రభుత్వం సమాధానం చెప్పకపోగా దాడులకు పాల్పడటం వారి దుర్మార్గాలకు నిదర్శనమన్నారు. మహాత్మాగాంధీ, పొట్టిశ్రీరాములు వారసత్వంలో పుట్టినవాడినని, ఉద్యమాలకు వెనుకాడబోనని వెలంపల్లి హెచ్చరించారు. డీఎస్సీ నియామకాల్లో జరిగిన అవకతవకలకు నైతిక బాధ్యత వహిస్తూ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. గంజాయి అరికట్టడంలో ప్రభుత్వం విఫలమైందని ఆయన విమర్శించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement