అమరావతి పికిల్‌బాల్‌ లీగ్‌ ప్రారంభం | - | Sakshi
Sakshi News home page

అమరావతి పికిల్‌బాల్‌ లీగ్‌ ప్రారంభం

Aug 8 2026 1:41 AM | Updated on Aug 8 2026 1:41 AM

మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): యువతలో క్రీడా స్ఫూర్తిని కలిగించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని రాష్ట్ర రవాణా, యువజన, క్రీడల శాఖా మంత్రి రాంప్రసాద్‌రెడ్డి చెప్పారు. స్థానిక భారతీనగర్‌లోని నైట్రో పికిల్‌ బాల్‌ అండ్‌ కెఫేలో శుక్రవారం అమరావతి పికిల్‌బాల్‌ లీగ్‌ను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడతూ పికిల్‌బాల్‌ వంటి నూతన క్రీడను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌, ఏపీ క్రీడా ప్రాధికార సంస్థ (శాప్‌) చైర్మన్‌ ఎ.రవినాయుడు, సినీ హీరో సుశాంత్‌ పాల్గొన్నారు. ఈ నెల 9వ తేదీ వరకు పికిల్‌బాల్‌ పోటీలు జరుగుతాయన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement