శాసీ్త్రయ ఆలోచనలను పెంపొందించుకోవాలి | - | Sakshi
Sakshi News home page

శాసీ్త్రయ ఆలోచనలను పెంపొందించుకోవాలి

Aug 8 2026 1:41 AM | Updated on Aug 8 2026 1:41 AM

వన్‌టౌన్‌(విజయవాడపశ్చిమ): విద్యార్థుల్లో శాసీ్త్రయ ఆలోచనా విధానాన్ని పెంపొందించి, సమస్యలకు పరిష్కారాలను చూపించేలా బాలలను భావి శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దాలని జిల్లా విద్యాశాఖాధికారి ఎల్‌.చంద్రకళ అన్నారు. ఎన్‌సీఎస్‌సీ–2026, ఇన్‌స్పైర్‌ మనాక్‌ –2026పై జిల్లాలోని పాఠశాలల సైన్స్‌ ఉపాధ్యాయులకు అవగాహన సదస్సును ఆంధ్రా లయోల కళాశాలలో శుక్రవారం నిర్వహించారు. జిల్లా సైన్స్‌ అధికారి కె.పిచ్చేశ్వరరావు అధ్యక్షతన జరిగిన సమావేశానికి చంద్రకళ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఆమె మాట్లాడుతూ విద్యార్థులను కేవలం పాఠ్యపుస్తక పరిజ్ఞానానికే పరిమితం చేయకుండా ప్యూర్‌ సైన్సెస్‌, పరిశోధన, ప్రయోగాత్మక అభ్యసన వైపు ప్రోత్సహించాలని సూచించారు. రాష్ట్ర అకడమిక్‌ కోఆర్డినేటర్‌ మైనం హుస్సేన్‌ ఉత్తమ ప్రాజెక్ట్‌కు అవసరమైన ముఖ్య లక్షణాలను వివరించారు. రిసోర్స్‌ పర్సన్‌లు శివకుమారి, బాలకరుణకుమార్‌, పి.నాగేశ్వరరావు, డి.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement