బెజవాడ దుర్గమ్మకు తిరువూరు పోలీసుల సారె | - | Sakshi
Sakshi News home page

బెజవాడ దుర్గమ్మకు తిరువూరు పోలీసుల సారె

Aug 6 2026 7:56 AM | Updated on Aug 6 2026 7:56 AM

బెజవాడ దుర్గమ్మకు తిరువూరు పోలీసుల సారె తిరువూరు: ఆషాఢమాసం సందర్భంగా విజయవాడ శ్రీకనకదుర్గమ్మకు తిరువూరు పోలీసులు బుధవారం సారె సమర్పించారు. తిరువూరు పోలీసుస్టేషను నుంచి మహిళా పోలీసులు సారెతో విజయవాడ తరలివెళ్లారు. సీఐ గిరిబాబు, ఎస్‌ఐలు శాతకర్ణి, టి. గౌరీశ్వరిల ఆధ్వర్యంలో ఊరేగింపుగా ప్రత్యేక వాహనంలో సారెను విజయవాడ తీసుకెళ్లి కనకదుర్గమ్మకు సమర్పించారు. ‘తల్లికి వందనం’ ఫిర్యాదుల స్వీకరణ గడువు పొడిగింపు గల్లంతైన యువకుడి మృతదేహం లభ్యం

గాంధీనగర్‌(విజయవాడసెంట్రల్‌): ఎన్టీఆర్‌ జిల్లాలో తల్లికి వందనం పథకంపై ఫిర్యాదుల స్వీకరణకు ఈనెల 7వ తేదీ వరకు గడువు పొడిగించినట్లు కలెక్టర్‌ డాక్టర్‌ జి.లక్ష్మీశ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. జాబితాలో అర్హుల పేరు లేకపోవడం, వివరాల్లో ఏవైనా తప్పులు ఉండడం, అనర్హులుగా చూపడం, ఇతర ఏవైనా అభ్యంతరాలు ఉంటే సంబంధిత గ్రామ, వార్డు సచివాలయంలో సంప్రదించాలని కోరారు. తమ అభ్యంతరాలపై ఫిర్యాదు నమోదు చేసుకోవచ్చన్నారు. తమకు అందిన ప్రతి ఫిర్యాదును ప్రభుత్వ నిబంధనల ప్రకారం పరిశీలించి, అర్హత ప్రమాణాలకు అనుగుణంగా తగిన చర్యలు తీసుకుంటామన్నారు.

పెనమలూరు: పెనమలూరు వంతెన వద్ద బందరు కాలువలో గల్లంతైన యువకుడు నూకరాజు మృత దేహం లభ్యమైంది. ఎస్‌డీఆర్‌ఎఫ్‌ తీవ్రంగా గాలించటంతో గంగూరు గ్రామ పరిధి బందరు కాలువలో మృతదేహం కనబడటంతో స్వాధీనం చేసుకున్నారు. అలాగే మంగళవారం కాలువులో కొట్టుకు వచ్చిన మరో మృతదేహాన్ని కూడా పోలీసులు బయటకు తీశారు. బందరు కాలువలో మంగళవారం సాయంత్రం గుర్తు తెలియని మృతదేహం కొట్టుకు రావటంతో మృతదేహం వెలికి తీయటానికి పెనమలూరు గ్రామానికి చెందిన నూకరాజు కాలువలో దిగి గల్లంతయ్యాడు. కాలువలో గుర్రపు డెక్క విపరీతంగా ఉండటంతో ఈత కొడుతూ నూకరాజు కాలువ లో అదృశ్యమయ్యాడు. దీంతో బుధవారం ఎస్డీ ఆర్‌ఎఫ్‌ బృందం రంగంలోకి దిగి బందరు కాలువలో గాలింపు చేపట్టారు. కంకిపాడు లాకుల వద్ద నీరు పారుదల జరగకుండా లాకులు కట్టించి కాలువలో విస్తృతంగా గాలింపు చేశారు. చివరకు గంగూరు కరెంట్‌ ఆఫీస్‌ వెనుక బందరు కాలువలో నూకరాజు మృతదేహం కనబడింది.. ఎస్‌డీఆర్‌ఎఫ్‌ బృందం మృతదేహాన్ని పోలీసులకు స్వాధీనం చేశారు.

మరో మృతదేహం కూడా..

కాగా బందరు కాలువలో మంగళవారం నీటి ప్రవాహంలో కొట్టుకు వచ్చిన మృతదేహం పెనమలూరు వంతన వద్ద గుర్రపు డెక్కలో నిలిచిపోయింది. బుధవారం ఉదయం ఎస్‌ఐ తాతాచారి ఆధ్వర్యంలో కాలువలో ఉన్న మృతదేహాన్ని బయటకు తీశారు. మృతుడి వయస్సు 35 నుంచి 40 మధ్య ఉంటుందని, మృతుడు నీలం రంగు జీన్‌ప్యాంట్‌, తెలుపురంగు టీషర్ట్‌ వేసుకున్న మగ వ్యక్తి అని ఎస్‌ఐ తెలిపారు. సమాచారం తెలిసిన వారు 9618336684కు ఫోన్‌ చేసి వివరాలు తెలపాలని ఎస్‌ఐ కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement