లబ్బీపేట(విజయవాడతూర్పు): జాతీయ మార్గదర్శకాలకు అనుగుణంగా సవరించిన పాఠ్యాంశాన్ని ఫిజియో కళాశాలల్లో అమలు చేయడం ద్వారా విద్యా ప్రమాణాలను మరింత మెరుగుపరచవచ్చని డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ డాక్టర్ పులాల చంద్రశేఖర్ అన్నారు. నేషనల్ కమిషన్ ఫర్ అలైడ్ అండ్ హెల్త్‌కేర్ ప్రొఫెషన్స్ (ఎన్‌సీఏహెచ్‌పీ) రూపొందించిన సవరించిన బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ పాఠ్యాంశంపై హెల్త్ యూనివర్సిటీలో మంగళవారం ఓరియంటేషన్ కార్యక్రమం నిర్వహించారు. తొలుత ఈ కార్యక్రమాన్ని రిజిస్ట్రార్ డాక్టర్ టి. సాయిసుధీర్‌తో కలిసి వీసీ డాక్టర్ చంద్రశేఖర్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంబించారు. అనంతరం వీసీ మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రభుత్వ వైద్య కళాశాలల్లో బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ కోర్సు ప్రారంభానికి విశ్వవిద్యాలయం ప్రతిపాదనలు పంపినట్లు తెలిపారు. ఏడీఎంఈ డాక్టర్ వి. రాధికారెడ్డి, సీఓఈ డాక్టర్ శ్రీకాంత్, ఏపీ స్టేట్ అలైడ్ అండ్ హెల్త్‌కేర్ ప్రొఫెషన్స్ కౌన్సిల్ చైర్మన్ యలమంచిలి వెంకటేశ్వరరావు, రిజిస్ట్రార్ భీమ సుమైల తదితరులు పాల్గొన్నారు.
ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ
వీసీ డాక్టర్ చంద్రశేఖర్


