గాంధీనగర్(విజయవాడసెంట్రల్): గాంధేయ విలువలతో నిరాడంబర జీవితం సాగించిన వ్యక్తి మండలి వెంకట కృష్ణారావు అని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ కొనియాడారు. మంగళవారం ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్‌లోని పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో స్వాతంత్య్ర సమరయోధుడు, మాజీ మంత్రి మండలి వెంకట కృష్ణారావు జయంతి కార్యక్రమం జరిగింది. మాజీ మంత్రి మండలి చిత్రపటానికి కలెక్టర్ పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలి వెంకట కృష్ణారావు నిజాయితీ, చిత్తశుద్ధితో ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారన్నారు. సమాజ సేవే జీవిత ధ్యేయంగా ఎంచుకున్న అరుదైన నాయకుడని పేర్కొన్నారు. 1977 దివిసీమ ఉప్పెన అనంతరం సహాయ, పునరావాస కార్యక్రమాలను సమర్థంగా సమన్వయం చేసి వేలాది బాధిత కుటుంబాలకు అండగా నిలిచారని తెలిపారు. కార్యక్రమంలో డీఆర్‌ఓ ఎం.లక్ష్మీ నరసింహ, కలెక్టరేట్ సిబ్బంది పాల్గొన్నారు.
కలెక్టర్ డాక్టర్ లక్ష్మీశ


