మోపిదేవి: పట్టపగలు ఇంటితాళాలు పగలకొట్టి బంగారం, నగదు దోచుకుపోయిన ఘటన మోపిదేవి కాలనీలో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం అవనిగడ్డ ఆర్టీసీ డీపోలో బొర్రా వేణుబాబు డ్రైవర్. గత నెల 28వ తేదీ భోగాపురం ఎయిర్ పోర్ట్ ప్రారంభానికి బస్సు డ్రైవర్‌గా డ్యూటీలో వెళ్లారు. ఆదివారం సుమారు 11 గంటల సమయంలో డ్యూటీ దిగి ఇంటికి వచ్చినప్పుడు భార్య, పిల్లలు సమీపంలోని చర్చికి వెళ్లారు. ఆయన ఇంటి లోపలకు వెళ్లేందుకు గడియతీయబోగా పగలగొట్టినట్లు గుర్తించారు. ఆయన పోలీసులకు సమాచారం ఇవ్వడంతో చల్లపల్లి ఎస్‌ఐ దుర్గాంజనేనయులు సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకున్నారు. తాళం గడియ పగలకొట్టినట్లు గుర్తించి, క్లూస్ టీంకు సమాచారం అందించారు. వారు వచ్చి వేలిముద్రలు సేకరించారు. ఈ సందర్భంగా బాధితులు తమ ఇంటి నుంచి సుమారు రూ.10 లక్షల విలువైన బంగారు హారం, చెయిన్, చెవిదిద్దులు, మ్యాటీలతో పాటు సుమారు రూ. 1.50 లక్షల నగదు దోచుకెళ్లినట్లు తెలిపారు. ఫిర్యాదు అందుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ గౌతమ్‌కుమార్ తెలిపారు.


