చిలకలపూడి(మచిలీపట్నం): దివ్యాంగులు ఇతరులపై ఆధారపడకుండా స్వయం ఉపాధి, ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకుని ఆత్మవిశ్వాసంతో జీవించాలని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎకై ్సజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. ఏపీ విభిన్న ప్రతిభావంతులు, వయోవృద్ధుల సహాయ సంస్థ (ఏపీడీఏఎస్) ఆధ్వర్యంలో ఆదివారం కలెక్టరేట్ ఆవరణలో జిల్లాకు చెందిన 43 మంది శారీరక దివ్యాంగులకు హోండా 125 సీసీ పెట్రోల్ స్కూటర్లను మంత్రి పంపిణీ చేశారు. కార్యక్రమంలో విభిన్న ప్రతిభావంతులు, వయోవృద్ధుల సహాయ సంస్థ చైర్మన్ నారాయణస్వామి, ఏడీ కామరాజు, గౌడ కార్పొరేషన్ చైర్మన్ వీరంకి వెంకట గురుమూర్తి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కుంచె దుర్గాప్రసాద్ (నాని) తదితరులు పాల్గొన్నారు.


