లోకేష్‌ రాజీనామా చేయాలి | - | Sakshi
Sakshi News home page

లోకేష్‌ రాజీనామా చేయాలి

Aug 3 2026 4:03 AM | Updated on Aug 3 2026 4:03 AM

● వెలంపల్లి మాట్లాడుతూ డీఎస్సీపై విచారణ చేయాలని, యువత జెన్‌ జీ పేరుతో పోరాటం చేస్తున్నారన్నారు. సాఫ్ట్‌బాల్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడిగా టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్‌, జూడో అసోసియేషన్‌ గౌరవాధ్యక్షుడిగా ఎంపీ భరత్‌ వ్యవహరిస్తూ తమ పరిధిలోని సంఘాల నుంచి పారదర్శకత లేకుండా సర్టిఫికెట్లు ఇచ్చి ఉద్యోగాలు కట్టబెట్టారన్నారు. ● మల్లాది విష్ణు మాట్లాడుతూ రెండేళ్లలో కూటమి ప్రభుత్వం ఏ ఒక్క పథకాన్ని పూర్తిగా అమలు చేయలేదన్నారు. ● మాజీ మేయర్‌ రాయన భాగ్యలక్ష్మి మాట్లాడుతూ జగన్‌మోహన్‌రెడ్డి పరిపాలనలో లక్షలాది ఉద్యోగాలిచ్చినా ఎక్కడా ఆరోపణ రాలేదన్నారు. విద్య, వసతి దీవెన, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు రూ. 9,500 కోట్లు వెంటనే చెల్లించాలని కోరారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఎండీ రుహుల్లా, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్‌ ఆసిఫ్‌, విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పానుగంటి చైతన్య, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు కొరివి చైతన్య వర, మాజీ కార్పొరేటర్లు, మాజీ చైర్మన్లు, మాజీ డైరెక్టర్లు, డివిజన్‌ పార్టీ అధ్యక్షులు, పార్టీ రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, క్లస్టర్‌, డివిజన్‌ స్థాయి నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు

డీఎస్సీలో అక్రమాలపై సీబీఐ విచారణ చేయాలి స్పోర్ట్స్‌ కోటా మొత్తం అక్రమాల పుట్ట ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలతో విద్యార్థుల అవస్థలు ‘పశ్చిమ’లో జెన్‌జీ వార్‌ తొలి సమావేశం

వన్‌టౌన్‌(విజయవాడపశ్చిమ): డీఎస్సీ అక్రమాలతో పాటుగా విద్యాశాఖను పూర్తిగా దిగజార్చిన రాష్ట్ర మంత్రి నారా లోకేష్‌ తక్షణం రాజీనామా చేయాలని వైఎస్సార్‌ సీపీ శ్రేణులు డిమాండ్‌ చేశారు. డీఎస్సీలో జరిగిన అక్రమాలపై సీబీఐ విచారణ వేయాలని, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు విడుదల చేయాలని, నిరుద్యోగ భృతి మూడు వేలు తక్షణం మంజూరు చేయాలని కోరుతూ జెన్‌జీ వార్‌ పేరుతో వైఎస్సార్‌ సీపీ పశ్చిమ నియోజకవర్గ ఇన్‌చార్జి వెలంపల్లి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో స్థానిక పాలప్రాజెక్ట్‌ కన్వెన్షన్‌ హాల్‌లో ఆదివారం సమావేశం నిర్వహించారు.

యువత ఉద్యమించాలి

రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న డీఎస్సీ అక్రమాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌, నిరుద్యోగ భృతి తదితర అంశాలపై యువత ఉద్యమించాలని వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్‌ పిలుపునిచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement