మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో విద్యాశాఖ అస్తవ్యస్తంగా మారింది. జూన్‌లో ప్రారంభం కావాల్సిన విద్యా సంవత్సరం చాలా కోర్సులకు సంబంధించి అక్టోబర్, నవంబర్ మాసాలు దాటినా కావటం లేదు. ఫీజు రీయింబర్స్‌మెంట్ రాకపోవడంతో లక్షలాది మంది విద్యార్థులకు సర్టిఫికెట్లు కళాశాలలు ఇవ్వటం లేదు.
–అజయ్, రీసెర్చ్ స్కాలర్
ఇంటర్మీడియెట్ పూర్తైంది. కౌన్సెలింగ్ ద్వారా ఇంజినీరింగ్ సీటు వస్తే ఆ కళాశాలకు వెళ్లాం. ఫీజు రీయింబర్స్‌మెంట్ డబ్బులు రావటం లేదు. ఫీజు కడితేనే సీటు ఇస్తామంటూ ఆ యజమాన్యం చెప్పింది. విద్యార్థులు చాలా ఇబ్బందులు పడుతున్నారు.
–వైష్ణవి, విద్యార్థిని
మెగా డీఎస్సీ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం మెగా స్కామ్‌కు పాల్పడింది. ఎటువంటి అర్హత లేకపోయినా పరీక్ష రాకపోయినా, టెట్ క్వాలిఫై అవ్వకపోయినా లక్షలాది రూపాయాలకు డీఎస్సీ పోస్టులు అమ్ముకున్నట్లుగా తెలిసింది. ప్రభుత్వమే ఈ విధమైన దారుణాలకు పాల్పడితే మా లాంటి విద్యార్థులు ఎలా చదువుకుంటారు?
–హృజని, విద్యార్థి
రాష్ట్రంలో విద్యార్థులు యువతకు ప్రభుత్వం ప్రకటించిన పథకాలేమి అమలు కావడం లేదు. మరోవైపు యువతకు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి ఏమీ ఇవ్వడం లేదు. ఆడబిడ్డ నిధి గురించి మాట్లాడటం లేదు.
–ప్రణతి, విద్యార్ధి


