బిడ్డకు తల్లిపాలు అమృతం లాంటివి | - | Sakshi
Sakshi News home page

బిడ్డకు తల్లిపాలు అమృతం లాంటివి

Aug 2 2026 1:58 AM | Updated on Aug 2 2026 1:58 AM

లబ్బీపేట(విజయవాడతూర్పు): బిడ్డకు తల్లిపాలు అమృతంతో సమానమని, పుట్టిన బిడ్డకు ఆరు నెలల వరకూ కేవలం తల్లిపాలు మాత్రమే పట్టాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్‌ ఎ.శ్రావణ్‌బాబు తెలిపారు. పాత ఆస్పత్రిలోని కాన్ఫరెన్స్‌ హాలులో శనివారం ప్రపంచ తల్లిపాల వారోత్సవాలను పురస్కరించుకుని అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్‌ శ్రావణ్‌బాబు మాట్లాడుతూ ఉద్యోగం చేసే మహిళలు సైతం బిడ్డకు తల్లిపాలు మాత్రమే ఇవ్వాలని అన్నారు. పుట్టిన గంటలోపు ఇచ్చే ముర్రుపాలు శిశువులో వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయన్నారు. బిడ్డకు పాలు ఇవ్వడం ద్వారా తల్లికి రొమ్ముక్యాన్సర్‌ వచ్చే అవకాశాలు తగ్గుతాయన్నారు. కార్యక్రమంలో ప్రభుత్వాస్పత్రి పిడియాట్రిక్‌ విభాగాధిపతి డాక్టర్‌ పి.అనిల్‌కుమార్‌, డీఐఓ డాక్టర్‌ శరత్‌బాబు, డెప్యూటీ ఆర్‌ఎంఓ డాక్టర్‌ ఝాన్సీ, పలువురు అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు, పోసు్ట్రగాడ్యుయేషన్‌ విద్యార్థులు పాల్గొన్నారు.

ఎన్టీఆర్‌ జిల్లా డీఎంహెచ్‌ఓ

డాక్టర్‌ ఎ.శ్రావణ్‌బాబు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement