విజయవాడ డివిజన్‌లో ఈ–పాస్‌ రిజిస్ట్రేషన్‌ శిబిరం | - | Sakshi
Sakshi News home page

విజయవాడ డివిజన్‌లో ఈ–పాస్‌ రిజిస్ట్రేషన్‌ శిబిరం

Aug 1 2026 1:37 AM | Updated on Aug 1 2026 1:37 AM

విజయవాడ డివిజన్‌లో ఈ–పాస్‌ రిజిస్ట్రేషన్‌ శిబిరం

రైల్వేస్టేషన్‌(విజయవాడపశ్చిమ): దక్షిణ కోస్తా రైల్వే, విజయవాడ డివిజన్‌, పర్సనల్‌ బ్రాంచ్‌ ఆధ్వర్యాన రైల్వే ఆడిటోరియంలో శుక్రవారం పెన్షనర్లు, ఫ్యామిలీ పెన్షనర్ల కోసం ఈ–పాస్‌ రిజిస్ట్రేషన్‌ శిబిరం నిర్వహించారు. కార్యక్రమంలో పెన్షనర్లు, ఫ్యామిలీ పెన్షనర్లకు డిజిటల్‌ ఈ–పాస్‌ వ్యవస్థపై అధికారులు అవగాహన కల్పించారు. వారికి అర్హత ఉన్న పాస్‌ సౌకర్యాలు పొందేందుకు హెచ్‌ఆర్‌ఎంఎస్‌ (హ్యూమన్‌ రిసోర్స్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టం) పోర్టల్‌లో నమోదు చేసుకోవడంపై అవగాహన కల్పించి వయోవృద్ధులు సులభంగా డిజిటల్‌ రైల్వే పాస్‌ విధానంలోకి మారేందుకు సహాయపడ్డారు. ఈ–పాస్‌ వ్యవస్థ ప్రాముఖ్యత, అర్హత ప్రమాణాలు, రిజిస్ట్రేషన్‌ దశలను వివరిస్తూ అధికారులు పీపీటీ ద్వారా వివరించారు.

సీనియర్‌ డీపీఓ ప్రేమ్‌కుమార్‌ లకావత్‌ మాట్లాడుతూ మొత్తం 299 మంది పెన్షనర్లు హాజరవ్వగా వారి ఖాతా యాక్టివేషన్‌ పత్రాల ధ్రువీకరణకు సంబంధించిన సమస్యలను పరిష్కరించి 105 రిజిస్ట్రేషన్‌లు అక్కడికక్కడే విజయవంతంగా పూర్తి చేసినట్లు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement