డీఎస్సీ అవకతవకలపై లోకేష్‌ రాజీనామా చేయాలి | - | Sakshi
Sakshi News home page

డీఎస్సీ అవకతవకలపై లోకేష్‌ రాజీనామా చేయాలి

Jul 26 2026 7:48 AM | Updated on Jul 26 2026 7:48 AM

వైఎస్సార్‌ సీపీ ఎన్టీఆర్‌ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్‌

లబ్బీపేట(విజయవాడతూర్పు): రాష్ట్రంలో నిర్వహించిన డీఎస్సీ నియామకాల్లో జరిగిన అవకతవకలకు నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని వైఎస్సార్‌ సీపీ ఎన్టీఆర్‌ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్‌ శనివారం ఓ ప్రకటనలో డిమాండ్‌ చేశారు. నీట్‌ పేపర్‌ లీక్‌ వ్యవహారంలో దేశవ్యాప్తంగా తీవ్ర స్థాయిలో వెల్లువెత్తిన నిరసనల నేపథ్యంలో నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ తన పదవికి రాజీనామా చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. అవే ప్రమా ణాలను ఆంధ్రప్రదేశ్‌లో కూడా పాటించాలని కోరారు. రాష్ట్రంలోని వేల మంది నిరుద్యోగ యువత భవిష్యత్తుతో ప్రభుత్వం చెలగాటం ఆడిందని, డీఎస్సీ నియామక ప్రక్రియలో అనేక అవకతవకలు, అక్ర మాలు చోటుచేసుకున్నాయని విమర్శించారు. అభ్యర్థుల్లో తీవ్ర ఆందోళన, అనిశ్చితి నెలకొన్నప్పటికీ ప్రభుత్వం వాటిని పట్టించు కోకుండా వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తంచేశారు. డీఎస్సీ నియామకాల్లో జరిగిన లోపాలపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, నిరుద్యోగులకు న్యాయం చేయాలని దేవినేని అవినాష్‌ డిమాండ్‌ చేశారు. రాష్ట్ర యువత అడుగుతున్న ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం చెప్పాలని, డీఎస్సీ అవకతవకలకు నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ వెంటనే రాజీనామా చేయాలని అవినాష్‌ డిమాండ్‌ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement