వన్‌టౌన్(విజయవాడపశ్చిమ): ప్రభుత్వ విద్యాసంస్థల్లో సమస్యలను పరిష్కరించాలని పలు పాఠశాలల్లో విద్యార్థుల తల్లిదండ్రులు ఆయా ప్రధానోపాధ్యాయులకు, వచ్చిన అతిథులకు మొరపెట్టుకున్నారు. మెగా పీటీఎంను జిల్లాలో ఉన్న అన్ని పాఠశాల్లోనూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. పాఠశాల్లో సమస్యలను పరిష్కరించాలంటూ తల్లిదండ్రులు వినతులు సమర్పించారు. ప్రధానంగా నాడు–నేడులో నిలిచిపోయిన పనులను పూర్తి చేసి తరగతి గదులను అందుబాటులోకి తీసుకురావాలని కోరారు. సమావేశాల్లో కూటమి నేతలకు ఎటువంటి పదవులు లేకపోయినా ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులపై పెత్తనం చెలాయించారు. చాలా విద్యాసంస్థల్లో తల్లికి వందనం నిధులు పడలేదంటూ తల్లిదండ్రులు ప్రధానోపాధ్యాయులను నిలదీశారు. పీటీఎంకు ప్రైవేట్ విద్యాసంస్థలు దూరంగా ఉన్నాయి.


