స్వచ్ఛందం.. ప్రశాంతం | - | Sakshi
Sakshi News home page

స్వచ్ఛందం.. ప్రశాంతం

Jul 25 2026 1:47 AM | Updated on Jul 25 2026 1:47 AM

● ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి కె. ప్రసన్న కుమార్‌ మాట్లాడుతూ దేశంలో లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును కేంద్ర ప్రభుత్వం అంధకారంలోకి నెడుతోందన్నారు. ● ఏఐఎస్‌ఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు వలరాజు మాట్లాడుతూ ఢిల్లీ పోలీసులు వ్యవహరించిన తీరును ఖండిస్తున్నామన్నారు. ● డీవైఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి రామన్న మాట్లాడుతూ దేశంలో జరుగుతున్న పరిణామాలపై కూటమి ప్రభుత్వం నోరు మెదపడం లేదని విమర్శించారు. ● పీడీఎస్‌యూ రాష్ట్ర కార్యదర్శి రాజేష్‌ పలు అంశాలు వివరించారు. పీడీఎస్‌ఓ నేత భాను, ఏఐఎస్‌ఎఫ్‌ నేత సాయికుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

ఢిల్లీ దీక్షలకు మద్దతుగా విద్యార్థి, యువజన సంఘాల బంద్‌

ప్రభుత్వ విద్యాసంస్థలు దూరం

వన్‌టౌన్‌(విజయవాడపశ్చిమ): కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామాను డిమాండ్‌ చేస్తూ, ఢిల్లీలో జరుగుతున్న దీక్షలకు మద్దతుగా వివిధ విద్యార్థి, యువజన సంఘాల ఆధ్వర్యంలో చేపట్టిన విద్యాసంస్థల బంద్‌ జిల్లాలో శుక్రవారం ప్రశాంతంగా జరిగింది. నగరంలోని అన్ని ప్రైవేట్‌ విద్యాసంస్థలు, ఇంజినీరింగ్‌, ఐటీఐ తదితర వృత్తివిద్యా కళాశాలలు శుక్రవారం పూర్తిగా మూతపడ్డాయి. పీబీ సిద్ధార్థ కళాశాల నుంచి విద్యార్ధి సంఘాలు ర్యాలీగా బయలుదేరి వివిధ ప్రాంతాల మీదుగా ముందుకు సాగుతూ బంద్‌ను విజయవంతం చేయించారు.

మెగా పీటీఎం పేరుతో ప్రభుత్వ విద్యాసంస్థలు బంద్‌కు దూరంగా ఉన్నాయి. కూటమి ప్రభుత్వం శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా మెగా పేరెంట్‌ అండ్‌ టీచర్స్‌ మీటింగ్‌ను అన్ని విద్యాసంస్థల్లో నిర్వహించాలని నిర్ణయించింది. ఆ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. అయితే కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా విద్యాసంస్థల బంద్‌కు విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చినా, కేంద్రానికి మద్దతుగా చంద్రబాబు మెగా పీటీఎంను అమలు చేయాలని నిర్ణయించినట్లు ఆయా నాయకులు చెబుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement