దుర్గమ్మ సేవలో దర్శకుడు అనిల్ రావిపూడి
రామవరప్పాడు: తిరుమల తిరుపతి దేవస్థాన నిత్య అన్నదాన ట్రస్టుకు నిడమానూరులోని ఢిల్లీ పబ్లిక్‌స్కూల్ యాజమాన్యం 10 టన్నుల కూరగాయలను మంగళవారం పంపించింది. డీపీఎస్ ప్రొవైస్ చైర్మన్ పరిమి నరేంద్రబాబు, డైరెక్టర్ సునంద జెండా ఊపి కూరగాయల లారీని ప్రారంభించారు. ఈ సందర్భంగా నరేంద్రబాబు మాట్లాడుతూ కీర్తిశేషులు మండ వ కుటుంబరావు స్ఫూర్తితో ఏటా ముక్కోటి ఏకాదశి నాడు తిరుమలలో నిత్యాన్నదాన కార్యక్రమాలకు తాము కూరగాయలు వితరణ చేస్తున్నామని తెలిపారు. పాఠశాల చైర్మన్ పరిమి పవన్ చందు, శ్వేత బింధు, డైరెక్టర్లు కడియాల ప్రవీణ్‌కుమార్, అకడమిక్ డైరెక్టర్ డేవిడ్ రాజు, ప్రిన్సిపాల్ భువనేశ్వరన్ పాల్గొన్నారు.
లబ్బీపేట(విజయవాడతూర్పు): జిల్లాలోని హైరిస్క్ గర్భిణులపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని ఎన్టీఆర్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ మాచర్ల సుహాసిని అన్నారు. గవర్నర్ పేటలోని ఐఎంఏ హాలులో హైరిస్క్ గర్భిణుల ట్రాకింగ్ అండ్ మేనేజ్‌మెంట్‌పై రెండు రోజుల శిక్షణ కార్యక్రమం మంగళవారం ప్రారంభమైంది. ఈ కార్యక్రమం ప్రారంభోత్సవంలో సుహాసిని ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఆమె మాట్లాడుతూ జిల్లాలోని ప్రతి గర్భిణిని గుర్తించి నమోదు చేయడంతో పాటు, హైరిస్క్‌లపై ప్రత్యేకంగా దృష్టి సారించాలన్నారు. వారికి సకాలంలో వైద్య సేవలు అందించడం, డెలివరీ సమయంలో వైద్య సిబ్బంది పర్యవేక్షణ, ప్రసవ సమయానికి ముందుగానే ఆస్పత్రికి తరలించడం వంటివి చేపట్టాలన్నారు. ఈ విషయంలో వైద్యాధికారులతో పాటు, క్షేత్రస్థాయి సిబ్బంది నిరంతర మోనటరింగ్ ఎంతో అవసరం అన్నారు. శిక్షణ కార్యక్రమం బుధవారం కూడా కొనసాగనుంది.
కొండపల్లి(ఇబ్రహీంపట్నం): కొండపల్లిలోని షాబూఖారీ దర్గా 429వ ఉరుసు ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. దర్గాలో బాబా వారిని పలువురు భక్తులు మంగళవారం దర్శించుకున్నారు. మతగురువు అల్తాఫ్ రజా బాబాకు చాదర్ సమర్పించి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు బాబాను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దాదాపు వంద స్టాళ్లు ఏర్పాటు చేసి భారీ అన్నదానం జరిపారు. అన్నదాన కార్యక్రమాన్ని ఆర్డీఓ కావూరి చైతన్య, వెస్ట్ జోన్ ఏసీపీ దుర్గారావు, సీఐ చంద్రశేఖర్ ప్రారంభించారు. అతిథులను మేళతాళాలతో ముస్లిం సంప్రదాయ పద్ధతిలో ఆహ్వానించారు.
దుర్గమ్మ సేవలో దర్శకుడు అనిల్ రావిపూడి
దుర్గమ్మ సేవలో దర్శకుడు అనిల్ రావిపూడి


