ఓవరాల్ చాంప్ ‘గుడ్లవల్లేరు పాలిటెక్నిక్’
మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): విద్యార్థులు చదువుతో పాటుగా క్రీడలకు ప్రాధాన్యం ఇవ్వాలని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ ఎం.విజయసారధి చెప్పారు. నగరంలోని రమేష్ ఆస్పత్రి సమీపంలో ఉన్న ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఆవరణలో సోమవారం మొదలైన రీజనల్ స్పోర్ట్స్ మీట్ మంగళవారం సాయంత్రంతో ముగిసింది. రెండు రోజుల పాటు జరిగిన ఈ రీజనల్ స్పోర్ట్స్ మీట్‌లో ఉమ్మడి కృష్ణాజిల్లాలోని 23 ప్రభుత్వ, ప్రైవేటు పాలిటెక్నిక్ కళాశాలల నుంచి 1200 మంది విద్యార్థులు పాల్గొన్నారు. పోటీల్లో విజేతలైన విద్యార్థులకు మంగళవారం సాయంత్రం బహుమతులు ప్రదానం చేశారు. విజయసారధితో పాటుగా స్థానిక కార్పొరేటర్ ఉషారాణి హాజరయ్యారు. ఓవరాల్ చాంపియన్ షిప్‌ను గుడ్లవల్లేరు పాలిటెక్నిక్ కళాశాలకు చెందిన బాలుర, బాలికలు జట్లు సొంతం చేసుకున్నాయి.
విజేతల వివరాలు..
● బాలికల వాలీబాల్ పోటీల్లో విన్నర్‌గా గుడ్లవల్లే రులోని ఏఏఎన్‌ఎం అండ్ వీవీఆర్‌ఎస్‌ఆర్ పాలిటెక్నిక్ కళాశాల, రన్నర్స్‌గా నూజివీడు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు నిలిచారు.
● ఖోఖో పోటీల్లో గుడ్లవల్లేరులోని ఏఏఎన్‌ఎం అండ్ వీవీఆర్‌ఎస్‌ఆర్ పాలిటెక్నిక్ కళాశాల మొదటి, ఎంవీఆర్ పాలిటెక్నిక్ కళాశాల రన్నర్స్‌గా నిలిచారు.
● షటిల్ బ్యాడ్మింటన్ సింగిల్స్ విభాగంలో గుడ్లవల్లేరు పాలిటెక్నిక్ కళాశాలకు చెందిన జి.గౌరీ సాత్విక మొదటి బహుమతి సొంతం చేసుకుంది. షటిల్ బ్యాడ్మింటన్ డబుల్స్ విభాగంలో మొదటి బహుమతిని గుడ్లవల్లేరు పాలిటెక్నిక్ కళాశాలకు చెందిన విద్యార్థులు సి.భానుశ్రీ, జి.బిందుశ్రీ సొంతం చేసుకున్నారు.
● టేబుల్ టెన్నిస్ సింగిల్స్‌లో ఆర్.రష్మిత, డబుల్స్ విభాగంలో డి.దీనా రాణి మొదటి బహుమతిని గెలుచుకున్నారు.
● 400 మీటర్ల రిలే రన్‌లో గుడ్లవల్లేరు పాలిటెక్నిక్ కళాశాలకు చెందిన విద్యార్థులు మొదటి బహుమతిని పొందారు.
● పురుషుల వాలీబాల్ పోటీల్లో నూజీవీడుకు చెందిన విద్యార్థులు మొదటి బహుమతిని, గుడ్లవల్లేరు పాలి టెక్నిక్ కళాశాల విద్యార్థులు రన్నర్స్‌గా, మూడో స్థానంలో వికాస్ కళాశాల విద్యార్థులు ఉన్నారు.
● కబడ్డీ పోటీల్లో మొదటి స్థానంలో గుడ్లవల్లేరు పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు, రన్నర్స్‌గా ఆర్‌కే కళాశాల, మూడో స్థానంలో ఎంవీఆర్ కళాశాల విద్యార్థులు నిలిచారు.
ముగిసిన పాలిటెక్నిక్ కళాశాలల
రీజనల్ స్పోర్స్ మీట్
ఓవరాల్ చాంప్ ‘గుడ్లవల్లేరు పాలిటెక్నిక్’


