టెక్సాస్‌లో గ్రాండ్‌గా 24వ వార్షిక అవార్డ్స్‌ బాంకెట్‌ | Us India Chamber Of Commerce 24th Annual Awards Banquet Held In Texas | Sakshi
Sakshi News home page

టెక్సాస్‌లో గ్రాండ్‌గా 24వ వార్షిక అవార్డ్స్‌ బాంకెట్‌

Published Sat, Nov 11 2023 12:02 PM | Last Updated on Sat, Nov 11 2023 12:48 PM

Us India Chamber Of Commerce 24th Annual Awards Banquet Held In Texas - Sakshi

అమెరికా, టెక్సాక్‌లో జరిగిన యూఎస్‌ ఇండియా ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ DFW 24వ వార్షిక అవార్డ్స్ బాంకెట్ కార్యక్రమానికి అనుహ్య స్పందన వచ్చింది. డల్లాస్‌ వేదికగా జరిగిన ఈ కర్యాక్రమానికి టెక్సాస్‌ గవర్నర్‌ గ్రెగ్‌ అబాట్‌, హ్యూస్టన్ కాన్సుల్ జనరల్ ఆఫ్ ఇండియా డీసీ మంజునాథ్‌ ముఖ్య అతిథులుగా హాజరై, ప్రసంగించారు. భారత్-అమెరికా దేశాల మధ్య ఉన్న బలమైన ద్వైపాక్షిక వాణిజ్యాల గురించి వారు ప్రస్తావించారు.

టెక్సాక్-భారత్ ఆర్థిక సంబంధాలు వృద్ధి చెందుతున్నట్లు పేర్కొన్నారు. టెక్సాస్ వృద్ధిలో భారతీయ అమెరికన్ల కృషిని కొనియాడారు. ఈ కార్యక్రమంలో భారతీయ, అమెరికన్ పారిశ్రామికవేత్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తమ అనుభవాలను పంచుకున్నారు. కార్యక్రమం విజయవంతం కావడంపై ఛాంబర్ ఆఫ్ కామర్స్ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు.

1999లో ఈ ఛాంబర్‌ని ప్రారంభించామని, ప్రతి ఏడాది లాగే ఈ సంవత్సరం కూడా వార్షిక అవార్డ్స్ బాంకెట్ ఈవెంట్‌ని గ్రాండ్‌గా నిర్వహించినట్లు తెలిపారు. 24వ వార్షిక అవార్డ్స్ బాంకెట్ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ నిర్వహకులు ధన్యవాదాలు తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement