సింగపూర్‌లో స్వరలయ త్యాగరాజ ఆరాధనోత్సవాలు | Swaralaya Thyagaraja Aradhanotsavam at singapore | Sakshi
Sakshi News home page

సింగపూర్‌లో స్వరలయ త్యాగరాజ ఆరాధనోత్సవాలు

Mar 21 2024 11:13 AM | Updated on Mar 21 2024 12:01 PM

Swaralaya Thyagaraja Aradhanotsavam at singapore - Sakshi

సింగపూర్‌లో స్వరలయ  ఆర్ట్స్ నిర్వహణ లో రెండవ ఏట  త్యాగరాజ ఆరాధనోత్సవాలు

సింగపూర్ లో స్వరలయ  ఆర్ట్స్ నిర్వహణ లో రెండవ ఏట  త్యాగరాజ ఆరాధనోత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ నెల మార్చి 18 వ తారీఖున స్వర లయ ఆర్ట్స్, సింగపూర్  వారి ఆధ్వర్యంలో  సింగపూర్ లో నివసించే తెలుగు గాయక గాయనీ మణులంతా ఉత్సాహంగా త్యాగరాజ ఆరాధనోత్సవములు జరుపుకున్నారు. 

సంగీత సాగరంలో ఓలలాడి, రామభక్తి లో మునిగి తేలి, యడవల్లి శేషు కుమారి,  సౌభాగ్య లక్ష్మి, షర్మిల,   సౌమ్య, కిరిటి,  శేషశ్రీ తదితరులు ఘన రాగ పంచరత్న కీర్తనలు ఆలపించగా, యడవల్లి శ్రీ విద్య తెర తీయగ రాదా అను కీర్తనతో స్వామిని కొలువగా,  ఆరగింపవే అను భక్తి నైవేద్యాలతో, పతికి మంగళ హారతీరే అంటూ మంగళ హారతులతో అందరూ త్యాగరాజ స్వామి ఆరాధనలు మిక్కిలి భక్తి ప్రపత్తులతో జరుపుకున్నారు. 

అనంతరం స్వర లయ ఆర్ట్స్, సింగపూర్ వ్యవస్థాపక అధ్యక్షులైన  శేషు కుమారి గారు సంగీతజ్నులకు మొమెంటోలను బాహుకరించి సత్కరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement