లండన్‌ ట్రఫాల్గర్ స్క్వేర్‌లో దీపావళి వేడుకలు

London Mayor Organised Annual Diwali Celebration At Trafalgar Square - Sakshi

లండన్‌: యూకేలో దీపావళి వేడుకలు ప్రారంభం అయ్యాయి. ప్రముఖ ట్రఫాల్గర్ స్క్వేర్‌లో లండన్‌ మేయర్‌ సాధిక్‌ ఖాన్‌ దీపావళి వేడుకలను నిర్వహించారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా చేసుకొనే ఈ వేడుకల్లో చిన్నా, పెద్ద అంతా కలిసి ఉత్సాహంగా పాల్గొని సందడి చేశారు. యూకేలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు ఈ వేడకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. 

ఈ  సందర్భంగా నిర్వహించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు పలువురిని అలరించాయి. భారతీయ సాంప్రదాయ నృత్యాలు సందర్శకులను ఆకట్టుకున్నాయి. ఇక దీపావళి వేడుకల్లో ఇండియన్‌ ఫుడ్‌ స్పెషల్‌ అట్రాక్షన్‌గా నిలిచింది. ఈ వేడుకలకు హాజరైన పలువురు మాట్లాడుతూ.. మొదటిసారి దీపావళి వేడుకల్లో పాల్గొన్నామని, ఇదొ ఒక అద్భుతమైన అనుభవం అంటూ తమ సంతోషాన్ని పంచుకున్నారు. 

Read latest NRI News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top