
ఆరోగ్యమే మహాభాగ్యం అంటున్నారు కొందరు ప్రముఖులు. అందుకోసం అత్యున్నతమైన కెరీర్‌ని కూడా వదిలేస్తున్నారు. ఆ కోవకు చెందని వారే భారత సంతతికి చెందిన ఈ సీఈవో. ఫిట్‌నెస్‌కి ప్రాధాన్యత ఇచ్చి మంచి కెరీర్‌కి స్వస్తి పలికిన వ్యక్తిగా వార్తల్లో నిలిచారాయన. ఎందుకిలా అంటే..
అమెరికాలో నివసిస్తున్న భారత సంతతికి చెందిన సీఈఓ సుధీర్ కోనేరు ఐఐటీ మద్రాస్ పూర్వ విద్యార్థి. ఆరోగ్యవంతంగా జీవించాలని మైక్రోసాఫ్ట్‌లో సుమారు 15 ఏళ్ల విజయవంతమైన కెరీర్‌కు స్వస్థి పలికి రిటైరయ్యారు. ప్రస్తుతం ఆయన సియాటిల్‌కు చెందిన జెనోటీ అనే కంపెనీకి నాయకత్వం వహిస్తున్నారు. ఇది సెలూన్లు, స్పాలు, ఫిట్‌నెస్ కేంద్రాలకు మంచి వ్యాపార సాఫ్ట్‌వేర్‌ని అందిస్తుందట.
అంతేగాదు 56 ఏళ్ల సుధీర్ మంచి ఆరోగ్యానికి పెద్దపీట వేసి మరీ బెంగళూరు బ్రీతింగ్ వర్క్‌షాప్‌లకు హాజరవుతారట. అందుకోసం సుమారు రూ. 1లక్ష నుంచి 1.6 లక్షలు ఖర్చు చేస్తారు. కేవలం నాలుగు రోజుల ఈ బ్రితింగ్ వర్క్‌షాప్‌లకు ఆయన ప్రతి ఏడాది రూ. 3.5 లక్షల వరకు ఖర్చు చేస్తారట. ఈ సెషన్లలో ఆధ్యాత్మిక శ్వాస పద్ధతులకు సంబంధించి రెండు గంటల గైడ్‌లైన్స్, ధ్యానాలు ఉంటాయట. వాటిని సుధీర్ శరీరాన్ని అద్భుతంగా నయం చేసేవి, చాలా శక్తిమంతమైనవిగా పేర్కొంటారాయన.
మైక్రోసాఫ్ట్‌లో సుధీర్ ప్రస్థానం..
సుధీర్ 1992లో మైక్రోసాఫ్ట్ ప్రొడక్ట్ మేనేజర్‌గా కెరీర్ ప్రారంభించి..జస్ట్ ఎనిమిదేళ్లకే 2000లో తన సొంత కంపెనీ ఇంటెలిప్రెప్‌ను ప్రారంభించారాయన. సరిగ్గా 2008లో అంటే 39 ఏళ్ల వయసులో కెరీర్ మంచి పీక్ పొజిషన్లో ఉండగా యోగా, వాకింగ్, జాగింగ్ వంటి ఫిట్‌నెస్ కోసం కంపెనీని విడిచిపెట్టారు. తాను ఆర్థికంగా ఉన్నత స్థితిలోఉన్నా..కానీ ప్రస్తుత లక్ష్యం కేవలం తన వ్యక్తిగత శ్రేయస్సు తోపాటు కుటుంబంతో బలమైన బంధాలు ఏర్పరుచుకోవడమేనని చెబుతున్నారు సుధీర్.
వర్క్ పరంగా తాను చాలా బెస్ట్ కానీ, కేవలం డబ్బు సంపాదించడమే కాదు..అంతకుమించి తన కోసం సమయం కేటాయించాలని, అప్పుడే ఆరోగ్యంగా ఉండగలమని గ్రహించానంటాడు సుధీర్. అందుకోసమే రెండేళ్ల సుదీర్థ సెలవుల అనంతరం మైక్రోసాఫ్ట్ కంపెనీని నుంచి పదవీ విరమణ చేసి జెనోటిని స్థాపించానని తెలిపారు. తన కంపెనీ సంస్కృతిలో వెల్నెస్ సూత్రాలు అందించడానికి ప్రయత్నిస్తున్నాడు.
అంతేగాదు తన సంస్థ పని సమయంలో యోగా, కిక్‌బాక్సింగ్, పైలేట్స్, వంటి ఫిట్‌నెస్ తరగతులను నిర్వహిస్తుంది. ఉద్యోగులు వీటిలో పాల్గొని వర్కౌట్లు చేసినట్లయితే మంచి పారితోషకం కూడా పొందుతారట. అంతేగాదు తన ఉద్యోగులకు స్పా, సెలున్లలో మంచి మసాజ్‌లు, ఆరోగ్యకరమైన స్నాక్స్ వంటివి కూడా అందుబాటులో ఉంటాయని చెబుతున్నారు. ఇక తన దృష్టిలో ఫిట్‌నెస్ అంటే సిక్స్ ప్యాక్‌ని కలిగి ఉండటం కాదట.
సమతుల్యమైన ఆహారంతో మంచి సామర్థ్యంతో జీవించడమే తన ధ్యేయమని చెబుతున్నారు. ఇక సుధీర్ వీక్‌ఆఫ్‌లతో సహా వారం రోజులు ఉదయమే ఏడింటికే యోగా చేస్తారట. బాలికి వెళ్లి కొన్నిరోజులు రెస్ట్ తీసుకుంటారట. అక్కడ మసాజ్‌లు, సన్‌బాత్ వంటి చికిత్సలు తీసుకుంటారట. అలాగే బెంగళూరులోని నాలుగు రోజుల శ్వాస వర్క్‌షాప్‌లో కూడా పాలుపంచుకుంటారట.
(చదవండి: 56 ఏళ్ల తర్వాత స్కూల్‌కి వెళ్తే..! పెద్దాళ్లు కాస్తా చిన్నపిల్లల్లా..)