ఆస్ట్రేలియాలో ఘనంగా సీఎం జగన్‌ బర్త్‌డే వేడుకలు | AP Cm Ys Jagan Birthday Celebrations Held At Australia | Sakshi
Sakshi News home page

ఆస్ట్రేలియాలో ఘనంగా సీఎం జగన్‌ బర్త్‌డే వేడుకలు

Dec 21 2023 3:32 PM | Updated on Dec 21 2023 4:09 PM

AP Cm Ys Jagan Birthday Celebrations Held At Australia - Sakshi

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి జన్మదిన వేడుకలను ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌ నగరంలో ఘనంగా నిర్వహించారు. ఆస్ట్రేలియా కన్వీనర్ చింతల చెరువు సూర్య నారాయణ రెడ్డి ఆధ్వర్యంలో ఈ వేడుకను ఉత్సాహంగా జరుపుకున్నారు.వైఎస్‌ఆర్‌పీ నాయకులు వెంకట్‌ మేడపటి,కరణం ధర్మశ్రీ ఈ సందర్భంగా జూమ్‌ కాల్‌లో మాట్లాడి బర్త్‌డే వేడుకల్లో పాల్గొన్నారు. 

దివంగత వైఎస్‌ రాజశేఖర రెడ్డి చేపట్టిన అభివృద్ది కార్యక్రమాలను మరోసారి గుర్తు చేసుకుంటూ.. జగన్‌మోహన్‌ రెడ్డి తండ్రికి మించిన పాలన అందిస్తున్నారని కొనియాడారు. రాబోయే ఎన్నికల్లో జగన్‌ను మళ్లీ గెలిపించి అబివృద్ధిలో కూడా భాగస్వాములు కావాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. 


 

Advertisement
 
Advertisement
Advertisement