● రెండోస్థానంలో మహబూబ్‌నగర్
● ముగిసిన రాష్ట్రస్థాయి పోటీలు
నిర్మల్‌టౌన్: నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ మినీ స్టేడియంలో రెండ్రోజులుగా సాగుతున్న రాష్ట్రస్థాయి 12వ తెలంగాణ సాఫ్ట్‌బాల్ చాంపియన్‌షిప్–2026 జూనియర్ ఇంటర్ బాలికల పోటీలు సోమవారం ముగిశాయి. రాష్ట్రంలోని 21 జిల్లాల నుంచి 21 జట్లు పాల్గొన్నాయి. 450 మంది క్రీడాకారులు హాజరయ్యారు. నిజామాబాద్, మహబూబ్‌నగర్ జట్లు ఫైనల్‌కు చేరుకోగా పోరు హోరాహోరీగా సాగింది. నిజామాబాద్ జట్టు 6–5 పాయింట్ల తేడాతో విజేతగా నిలువగా.. మహబూబ్‌నగర్ ద్వితీయ, సిద్దిపేట తృతీయ బహుమతి గెలుచుకున్నాయి. విజేతలకు మున్సిపల్ మాజీ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్, ఇండియా సాఫ్ట్‌బాల్ అసోసియేషన్ జాయింట్ సెక్రెటరీ శోభన్‌బాబు, జిల్లా అసోసియేషన్ అధ్యక్షుడు పోశెట్టి, కార్యదర్శి అన్నపూర్ణ కప్ అందజేశారు. కార్యక్రమంలో సాఫ్ట్‌బాల్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నవీన్‌కుమార్, ఆదిలాబాద్ ప్రధాన కార్యదర్శి గస్కంటి గంగాధర్, నిర్మల్ జిల్లా ట్రస్మా అధ్యక్షుడు పద్మనాభగౌడ్, నిజామాబాద్, జగిత్యాల ప్రధాన కార్యదర్శులు గంగా మోహన్, వెంకటేశ్ పాల్గొన్నారు.
తొర్లికొండ విద్యార్థినికి బంగారు పతకం
జక్రాన్‌పల్లి: మండలంలోని తొర్లికొండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థిని సంజు బాయి రాష్ట్రస్థాయి సాఫ్ట్‌బాల్ పోటీల్లో రాణించి బంగారు పతకం అందుకున్నారు. నిర్మల్ జిల్లా ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహించిన 12వ రాష్ట్రస్థాయి జూనియర్ సాఫ్ట్‌బాల్ పోటీల్లో గేడం సంజు బాయి అద్భుత ప్రతిభ కనబర్చి జిల్లా జట్టు విజయంలో కీలకపాత్ర పోషించినట్లు పీడీ మర్కంటి గంగామోహన్ తెలిపారు. విద్యార్థిని సంజు బాయిని హెచ్‌ఎం, ఎంఈవో శ్రీనివాస్ అభినందించారు.


